Home Latest News వైఎస్ కుటుంబానికి.. ఇచ్చాపురంకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

వైఎస్ కుటుంబానికి.. ఇచ్చాపురంకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..?

శ్రీ‌కాకుళం జిల్లా బోర్డ‌ర్‌లో ఉన్న ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గానికి రాష్ట్రంలో ఓ ప్ర‌త్యేక‌త ఉంది. రాష్ట్రంలో ఎవ‌రు ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించాల‌న్నా, ప్ర‌జా పోరాట యాత్ర‌లు చేప‌ట్టాల‌న్నా, ఈ ప్రాంతం నుంచే ప్ర‌జా ప్ర‌తినిధులు క‌థ‌నం రంగంలోకి దూకుతారు.

అలాంటి ఇచ్చాపురం ఇప్పుడు మ‌రో చ‌రిత్ర‌కు వేదిక కాబోతుంది. అప్ప‌ట్లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఆ త‌రువాత వైఎస్ ష‌ర్మిళ, ఇప్పుడు జ‌గ‌న్ అంద‌రూ ఇక్క‌డ స్థూపాల‌ను నిర్మించారు. అందులో భాగంగానే ఇవాళ వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఇక్క‌డ పైలాన్‌ను ఆవిష్క‌రిస్తున్నారు. దీని కోసం ప్ర‌త్యేకంగా పైలాన్‌ను కూడా నిర్మించారు. ఏపీ రాజ‌కీయాల్లో చిర‌కాలం గుర్తుండిపోయేలా పైలాన్‌ను వైసీపీ శ్రేణులు నిర్మించారు.

నాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఏప్రిల్ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండువేస‌విలో ప్ర‌జా ప్ర‌స్థానం యాత్రను ప్రారంభించారు. 68 రోజుల‌పాటు 1470 కిలోమీట‌ర్ల మేర నిరాటంకంగా చేవెళ్ల నుంచి శ్రీ‌కాకుళం జిల్లా బోర్డ‌ర్ ఇచ్చాపురం వ‌ర‌కు చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది.

దీంతో ఇచ్చాపురంలో ప్ర‌జా ప్ర‌స్థానం జ్ఞాపిక పేరిట విజ‌య స్థూపాన్ని నిర్మించారు. 2004 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భంజ‌నం సృష్టించారు. ఫ‌లితంగా తొలిసారి వైఎస్ ముఖ్య‌మంత్రి అయ్యారు. అంతేకాకుండా, ఏపీ రాజ‌కీయాల్లో ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గంతోపాటు అక్క‌డ ఉన్న‌టువంటి ప్ర‌జా ప్ర‌స్థాన వాటిక‌లు కూడా చాలా ఫేమ‌స్ అయ్యాయి. ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ పోరాట యాత్ర‌ల‌ను ఎక్క‌డ్నుంచో ప్రారంభించి ఇచ్చాపురంకు చేరుకుంటే మాత్రం అధికారం వ‌రిస్తుంద‌ని న‌మ్మ‌కం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad