Home Latest News మ‌రో టీడీపీ నేత వాట్సాప్ సేవ‌లు నిలిపివేత‌..!

మ‌రో టీడీపీ నేత వాట్సాప్ సేవ‌లు నిలిపివేత‌..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన మ‌రో నేత ఫోన్ నెంబ‌ర్‌పై ఉన్న వాట్సాప్ సేవ‌ల‌ను నిలిపి వేస్తూ యాజ‌మాన్యం చ‌ర్య‌లు తీసుకుంది. గ‌త రెండు రోజుల క్రితం టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్ ఫోన్ నెంబ‌ర్‌పై ఉన్న వాట్సాప్ సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే క‌డ‌ప జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస్‌రెడ్డి ఫోన్ నెంబ‌ర్‌పై ఉన్న సేవ‌ల‌ను వాట్సాప్ యాజ‌మాన్యం నిలిపివేసింది.

ఈ విష‌యంపై శ్రీ‌నివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి త‌న వాట్సాప్‌కు ఎటువంటి మెసేజ్‌లు రాక‌పోగా, తాను పంపే మెసేజ్‌లు కూడా ఎవ్వ‌రికీ చేర‌లేద‌న్నారు. ఏదో నెట్ వ‌ర్క్ స‌మ‌స్య అనుకున్నా.. కానీ నా ఫోన్ నెంబ‌ర్‌పై వాట్సాప్ సేవ‌లు నిలిపి వేస్తున్న‌ట్లు మెసేజ్ వ‌చ్చింద‌ని శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు.

టీడీపీ నేత‌ల‌కు సంబంధించిన ఫోన్ నెంబ‌ర్ల‌పై ఉన్న వాట్సాప్ ఖాతాలే వ‌రుస‌గా బ్లాక్ అవుతుండ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని, కేంద్రంలో ఉన్న మోడీ ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని ఆరోపించారు. టీడీపీ నేత‌ల‌కు సంబంధించిన వాట్సాప్ సేవ‌ల‌ను నిలిపి వేయాలంటూ స‌ద‌రు కంపెనీపై మోడీ ప్ర‌భుత్వం ఒత్తిడి తెస్తుంద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad