ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్ల నియామకాలకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదివారం ప్రకటనలు (నోటిఫికేషన్) జారీ చేశారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకో వాలంటీర్ నియామకానికి అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేసింది. నేడు(సోమవారం) నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లోకి వెళ్లి gramavolunteer.ap.gov.in అప్లికేషన్లు పెట్టుకోవాలి.
తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 21,600 మంది వాలంటీర్ల కోసం ప్రకటన వెలువడింది. 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున జిల్లాల వారీగా లెక్కలు కట్టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అవసరాన్ని బట్టి వాలంటీర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.