అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(75) ఇకలేరు. ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆమె, హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు మొత్తం అక్కడేవుంచి రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. శుక్రవారం విజయ నిర్మల అంత్యక్రియలు జరుపుతారు. విజయనిర్మల మరణవార్తను ఆమె తనయుడు నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు.
Her body will be kept at our residence ( Nanakramguda) today from 11am Her final rites will be held tomorrow, that is, 28.6.2019.
Further information will be updated .
🙏🙏🙏🙏🙏 pic.twitter.com/MorRuNOXCM— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 27, 2019