Home General తెలంగాణ‌లో అకాల వ‌ర్షం బీభ‌త్సం..!

తెలంగాణ‌లో అకాల వ‌ర్షం బీభ‌త్సం..!

తెలంగాణ‌లో అకాల వ‌ర్షం రైతుల‌కు తీర‌ని న‌ష్టాన్ని మిగిల్చింది. చేతికి అందిన పంట‌ను నాశ‌నం చేసింది. రాష్ట్రంలో గాలివాన‌కు వంద‌ల ఎక‌రాల్లో పంట పొలాలు దెబ్బ తిన్నాయి. మ‌ధ్యాహ్నం చిరుజ‌ల్లుల‌తో మొద‌లైన వాన సాయంత్రానికి భారీ వ‌ర్షంగా మారింది. దీనికి గాలులు తోడ‌వ్వ‌డంతో బీభ‌త్సంగా మారింది. ముఖ్యంగా క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌న‌గామ‌, సిద్దిపేట జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డుల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్య‌పు రాశులు త‌డిసి ముద్ద‌య్యాయి. వ‌రిపంట‌తోపాటు మొక్క‌జొన్న‌, మామిడి తోట‌ల‌కు భారీగా న‌ష్టం వాటిల్లింది. అకాల వ‌ర్షంతో తీవ్రంగా న‌ష్ట‌పోయిన త‌మ‌ను ఆదుకోవాల‌ని రైతులు కోరుతున్నారు. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షంతో అక్క‌డ‌క్క‌డ పిడుగులుప‌డి చెట్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. యాదాద్రి జిల్లాలో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. బండ‌కొత్త‌ప‌ల్లిలో పిడుగుప‌డి స‌త్తెయ్య అనే గీత కార్మికుడు మృతి చెందాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad