Home Latest News రామప్రభతో నాకు పెళ్లి కాలేదు.. అలా అని అది సహజీవనం కూడా కాదు కేవలం..!

రామప్రభతో నాకు పెళ్లి కాలేదు.. అలా అని అది సహజీవనం కూడా కాదు కేవలం..!

రమాప్రభ, శరత్ బాబులు ఒకానొక సమయంలో పెళ్లి చేసుకున్నారని, 10 ఏళ్ళు కాపురం కూడా చేశారని, ఆ తరువాతే శరత్ బాబు, రామప్రభను మోసం చేసి తన ఆస్తులు మొత్తం లాక్కొని ఆమెను రోడ్డుపై ఒంటరిగా వాదిలేసాడు అనే వార్త నిన్నటి వరకు అందరికి తెలిసిందే. అది నిజమే అని రమాప్రభ గారు కూడా చాలా సార్లు చెప్పారు.

కానీ ఇప్పటివరకు ఈ విషయంలో శరత్ బాబు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఆమె గురించి ఎక్కడ ఏం మాట్లాడకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్నాడు.. దాంతో అందరు శరత్ బాబు కేవలం రమాప్రభ గారి “స్టార్ డమ్” అడ్డుపెట్టుకొని ఎదిగాడని, తరువాత ఆమె అవసరం తీరిపోయాక ఆస్తులు మొత్తం తన పేరున రాయించుకుని, నువ్వు సంపాదించింది ఏమి లేదు ఇదంతా నా సంపాదనే అని ఆమెను రోడ్డు మీద పడేసాడని, అయినా ఆమె బాధపడకుండా మల్లి కెరీర్ లో నిలదొక్కుకొని స్టార్ హోదా సంపాదించుకుంది అందరు నమ్ముతారు.

పైగా శరత్ బాబు లాంటి మోసగాళ్లు ఈ సమాజంలో చాలామంది ఉంటారని, వాళ్ళెవ్వరు నన్ను నిజంగా ఇష్టపడరు, కేవలం నా దగ్గరున్న డబ్బు, హోదా చూసే వస్తారు కాబట్టి ఇక నేను మరో పెళ్లి చేసుకోను, ఒంటరిగానే ఉంటాను అనే నిర్ణయం తీసుకుంది. అలాంటి రమాప్రభ గారు చెప్పింది పచ్చి అబద్దం ఆమె కావాలనే నా పరువు తీస్తుంది అంటూ ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు శరత్ బాబు.

అయన చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు అనుకుంటున్నట్లు మా ఇద్దరికీ పెళ్లి కాలేదు, అలా అని మాది సహజీవనం కూడా కాదు, అది బయటకు చెప్పుకోలేని సంబంధం అంతే, పైగా మీరు అనుకుంటున్నట్లు ఆమెను మోసం చేసి నేను ఏ ఆస్థి తీసుకోలేదు. నాకుతెలిసి ఆమెకున్న ఒకే ఒక్క ఆస్థి ఆమె పేరుమీద, అలాగే ఆమె తమ్ముడి పేరుమీద ఉంది. నిజం చెప్పాలంటే నేనే, ఆమెకు ప్రస్తుతం 60కోట్ల విలువచేసే ల్యాండ్ ని కొనిచ్చాను అంతే తప్ప ఆమెను మోసం చేసి బ్రతకలేను. నాకు ఆ అవసరం కూడా లేదు అంటూ అందరికి షాక్ ఇచ్చాడు శరత్ బాబు.

పైగా అందరు అనుకున్నట్లు పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులు ఆమెను చూసి నాకు ఆఫర్స్ ఇవ్వలేదని, నేను స్టార్ అయ్యే నాటికి ఆమె ఎవరోకూడా నాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు శరత్ బాబు. మరీ అతడు చెప్పింది ఎంత నిజం..! ఎంత అబద్దం..! అనేది రమాప్రభ గారికి, ఆ దేవుడికే తెలియాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad