Home Latest News బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్ సీఎం అయితే..!? ఉండ‌వ‌ల్లికి మంత్రి మండ‌లిలో చోటు..!

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్ సీఎం అయితే..!? ఉండ‌వ‌ల్లికి మంత్రి మండ‌లిలో చోటు..!

మొద‌టి విడ‌త సార్వ‌త్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 11న ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా పార్ల‌మెంట్, అసెంబ్లీ స్థానాల‌కు పోలింగ్ జరిగిన సంగ‌తి తెలిసిందే. పోలింగ్ ముగిసినప్ప‌టికీ ఎన్నిక‌ల సంఘం ఆదేశాల ప్ర‌కారం ఫ‌లితాల కోసం ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు వేచి చూడాల్సిన ప‌రిస్థితి. ఇలా ఫ‌లితాల కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం త‌మ‌కు వంద నుంచి 130 అసెంబ్లీ స్థానాలు, అలాగే 19 నుంచి 22 పార్ల‌మెంట్ స్థానాలు ప‌క్కా అన్న కాన్ఫిడెన్స్‌ను మీడియా ముందు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అంతేకాకుండా, వైసీపీదే అధికార‌మ‌ని ప‌లు ప్ర‌ముఖ స‌ర్వే ఏజెన్సీలు ఫ‌లితాల‌ను అధికారికంగా వెల్ల‌డించ‌డంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సాహ‌ల న‌డుమ మునిగితేలుతున్నారు. అలాగే త‌మ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఎలాగో ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌తాడు క‌నుక దివంగ‌త సీఎం వైఎస్ఆర్‌ను త‌ల‌పించేలా ప్ర‌జారంజ‌క పాల‌న చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌ల‌ను ఇప్పట్నుంచే ర‌చిస్తున్నాడంటూ పార్టీ వ‌ర్గాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌నే సీఎం అని చెప్పిన కొంద‌రు వైసీపీ ముఖ్య నేత‌లు ప‌లాన మంత్రి ప‌ద‌వి త‌మ‌కేనంటూ ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారాలు చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, వారి ప్ర‌చారాల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేలా వైఎస్ జ‌గ‌న్ త‌న కేబినేట్‌లో మంత్రి ప‌ద‌వుల విష‌య‌మై ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించిన‌ట్టు తెలుస్తుంది. అస‌లు పార్టీలో ఉన్న‌వారిలో గ‌తంలో మంత్రులుగా ఉన్న‌వారెవ‌రు..? సీనియ‌ర్‌లు ఎవ‌రు..? అన్న లెక్క‌లపై జ‌గ‌న్ క‌సర‌త్తు చేస్తున్నార‌ని పార్టీవ‌ర్గాల స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే గ‌తంలో మంత్రులుగా చేసిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాదరావు, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్లను జ‌గ‌న్ ప‌రిశీలించారు. ఇదిలా ఉండ‌గా, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాలను క‌చ్చితత్వంగా కొన‌సాగించ‌గ‌లిగే మంత్రిత్వ శాఖ‌ను ఎవ‌రికి అప్ప‌గించాల‌న్న డైల‌మాలో జ‌గ‌న్ ఉన్నాడ‌ట‌.

కాగా, నాడు వైఎస్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కొణిజేటి రోశ‌య్య శాస‌న స‌భ వ్య‌వ‌హారాల‌ను న‌డిపిన సంగతి తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ నేత‌ల‌కు రోశ‌య్య ఎంతో చాతుర్యాన్ని ఉప‌యోగించి స‌మాధానాలు చెప్పేవారు.

అలా వైఎస్ఆర్ హ‌యాంలో కొణిజేటి రోశ‌య్య వ్య‌వ‌హ‌రించిన తీరును గుర్తు చేసుకుంటూ అలా చాతుర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల‌ను న‌డ‌ప‌గ‌లిగే వారి కోసం అన్వేషించే క్ర‌మంలో జ‌గ‌న్‌కు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ పేరును కొంద‌రు పార్టీ ముఖ్య నేత‌లు సూచించిన‌ట్టు తెలుస్తుంది.

అంతేకాకుండా, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగిన వారిలో ఒక‌రు. అందులోను ఆయ‌న మాజీ ఎంపీగా చేయ‌డంతోపాటు స్వ‌త‌హాగా లాయ‌ర్ కూడాను. నాడు ఎన్టీఆర్ ప్ర‌భుత్వ హ‌యాం నుంచి నేటి వ‌ర‌కు రాజ‌కీయ అంశాల‌ను చెప్ప‌గ‌లిగిన వ్య‌క్తుల్లో ఉండ‌వ‌ల్లి ఒక‌రు. అందులోను నాడు చంద్ర‌బాబుకు, ఎన్టీఆర్‌కు మ‌ధ్య జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను ఇటీవ‌ల ప్రెస్‌మీట్‌లో ఉండ‌వ‌ల్లి ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. ఇలా అన్ని అంశాల‌ను బేరీజు వేసుకున్న వైఎస్ జ‌గ‌న్ ఉండ‌వ‌ల్లిని అసెంబ్లీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌ను కేటాయించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad