Home General రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు టీవీ ఆర్టిస్టులు మృతి..!

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు టీవీ ఆర్టిస్టులు మృతి..!

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు బుల్లితెర ఆర్టిస్టులు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో చోటు చేసుకుంది. టెలివిజ‌న్‌లో ప్ర‌సార‌మయ్యే ఓ సీరియ‌ల్‌లో న‌టిస్తున్న భార్గ‌వి (20), అనుషారెడ్డి (21)లు ఈ ప్ర‌మాదంలో మృతి చెందారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

భార్గ‌వి (20), అనుషారెడ్డి (21), మ‌రికొంద‌రు న‌టీన‌టులు, టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ సీరియ‌ల్ షూటింగ్ నిమిత్తం మొయినాబాద్ ప‌రిస‌ర ప్రాంత‌ల్లోని అడ‌వుల‌కు వెళ్లార‌ని, షూటింగ్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌కు తిరుగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు తెలిపారు.

మొయినాబాద్ వ‌ద్ద ఎదురుగా వ‌స్తున్న లారీని త‌ప్పించ‌బోయి సీరియ‌ల్ బృందం ప్ర‌యాణిస్తున్న కారు చెట్టును ఢీకొంద‌ని, ఈ ప్ర‌మాదంలో భార్గ‌వి అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా, అనుషారెడ్డి ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో మృతి చెందిన‌ట్టు పోలీసులు తెలిపారు. అలాగే కారు డ్రైవ‌ర్‌కు, విన‌య్ అనే వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని, ప్ర‌స్తుతం వారు ఉస్మానియా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్టు పోలీసులు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad