Home రాజకీయాలు మోదీ 'తోపు' అంటోన్న టైమ్ మ్యాగ‌జైన్

మోదీ ‘తోపు’ అంటోన్న టైమ్ మ్యాగ‌జైన్

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన‌ భారత్‌లో జ‌రుగుతోన్న‌సార్వత్రిక ఎన్నికల మీదే యావత్‌ ప్రపంచం దృష్టి ఉంది. అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ ‘టైమ్‌’ మ్యాగజైన్‌ భార‌త రాజ‌కీయాల‌పై ఒక ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. మోదీ వైపే మొగ్గుచూపిన‌ట్టుగా క‌నిపించిన ఈ వ్యాసానికి ‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ అంటూ వివాదాస్పద హెడ్‌లైన్‌ రాసింది. దీంతో పాటు ‘మోదీ ది రిఫార్మర్‌’ అనే మరో హెడ్‌లైన్ తో మ‌రో ఐటెం కూడా ఇచ్చింది.

‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరో ఐదేళ్లు మోదీ ప్రభుత్వం వస్తుందా?’ అనే పేరుతో తసీర్‌ కథనం రాశారు. ఇందులో మోదీ ప్రవేశపెట్టిన పథకాలు, జీఎస్‌టీ, ఆధార్‌ వినియోగం వంటి అంశాలు ప్రస్తావించారు. అంతేగాదు.. బలహీనమైన ప్రతిపక్షం ఉండటం మోదీకి అదృష్టమంటూ రచయిత పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలు మినహా ఇంకేమీ చేయట్లేదని దుయ్యబట్టారు. తాజాగా రాహుల్‌గాంధీకి తోడుగా ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అమెరికాలో 2020లో హిల్లరీ క్లింటన్ మళ్లీ పోటీ చేస్తే ఎలా ఉంటుందో ప్రియాంక రాజకీయాల్లోకి రావడం కూడా అలాంటిదేనని రచయిత అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘ఇండియాస్‌ డివైడర్‌ ఇన్‌ చీఫ్‌’ కథనాన్ని ప్రముఖ భారత జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ కుమారుడు ఆతిష్‌ తసీర్ రచించారు. మరో కథనం ‘మోదీ ది రిఫార్మర్‌’ను ప్రముఖ కన్సల్టింగ్‌ సంస్థ యురేసియా గ్రూప్‌ వ్యవస్థాపకుడు ఇయాన్‌ బ్రెమర్‌ రాశారు. మే 20, 2019న వెలువడే టైమ్‌ మ్యాగజైన్‌ యూరప్‌, మధ్య ప్రాశ్చ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్‌ అంతర్జాతీయ ఎడిషన్లలో ఈ కవర్‌స్టోరీ ప్రచురించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad