జనసేన సభలకు వచ్చే జనాల్లో చాలా మంది చిన్న పిల్లలే ఉన్నారని ప్రత్యర్ధ పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. అవును, నిజమే తన సభలకు వచ్చే వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలే ఉన్నారు. అయినంత మాత్రాన వారిని మనుషులుగా పరిగణించ వద్దా..? అంటూ ప్రశ్నించారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని గతంలో ఆయనకు మద్దతు ఇచ్చానని, ఆ తరువాత పాలనలో అనేక తప్పులు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతుందని చంద్రబాబుకు చాలా సార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదని, ఆ కారణంగానే టీడీపీతో అలయన్స్ నుంచి బయటకొచ్చినట్టు పవన్ తెలిపారు.
అదే సమయంలో జనసేన పార్టీ స్థాపన నుంచి నేటి వరకు మీరు ఎక్కువగా గడ్డంతోనే ఎక్కువగా కనిపించడానికి కారణం..? అన్న ప్రశ్న ఎదురవగా, అందుకు స్పందించిన పవన్ కళ్యాణ్ షూటింగ్ సమయాల్లో రోజూ గడ్డం తీసి, షేవింగ్ చేయడం చేసి చేసీ విసిగిపోయాను. అలా చేసి అలసట వచ్చేసింది. అందుకనే వదిలేస్తానని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.