Home Latest News ఇదే ఆఖ‌రి రోజు.. 'జ‌మ్మ‌ల మ‌డుగులో 144 సెక్ష‌న్'

ఇదే ఆఖ‌రి రోజు.. ‘జ‌మ్మ‌ల మ‌డుగులో 144 సెక్ష‌న్’

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నామినేష‌న్‌ల ఘ‌ట్టం నేటితో ముగియ‌నుంది. ఇవాళ గ‌డువు ముగిసేలోగా వ‌చ్చిన నామినేష‌న్‌ల‌ను ఎన్నిక‌ల అధికారులు రేపు ప‌రిశీలించ‌నున్నారు. అన్ని వివ‌రాలు స‌క్ర‌మంగా ఉన్న నామినేష‌న్‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అభ్య‌ర్ధుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. నామినేష‌న్‌ల ఉప సంహ‌ర‌ణ‌కు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. అనంత‌రం ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్య‌ర్ధుల‌తో అధికారులు జాబితాను సిద్ధం చేస్తారు. తెలంగాణ‌లోని 17 లోక్‌స‌భ స్థానాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 220 నామినేష‌న్‌లు దాఖ‌లు అయ్యాయి.

నామినేష‌న్‌ల దాఖ‌లుకు ఇవాళ చివ‌రి రోజు కావ‌డంతో ఎన్నిక‌ల అధికారుల కార్యాల‌యాల వ‌ద్ద హ‌డావుడి ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, ప్ర‌ధాన పార్టీల నుంచి అగ్ర‌నేత‌లంద‌రూ ఇప్ప‌టికే నామినేష‌న్‌ల‌ను దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఇవాళ అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. వైసీపీ నుంచి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు శ్రీ‌కాకుళం జిల్లాలో నామినేష‌న్ వేయ‌నున్నారు.

నామినేష‌న్‌ల దాఖ‌ల‌కు చివ‌రి రోజు కావ‌డంతో అభ్య‌ర్ధులు ఎక్కువ సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించిన ఎన్నిక‌ల అధికారులు ఎటువంటి ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోకుండా ప‌టిష్ట భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ, వైసీపీ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి అధికారులు భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. టీడీపీ త‌రుపున రామ‌సుబ్బారెడ్డి, వైసీపీ త‌రుపున సుధీర్ రెడ్డి అసెంబ్లీ అభ్య‌ర్ధులు నామినేష‌న్ వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad