Home Latest News పాద‌యాత్ర ముగియ‌గానే జ‌గ‌న్ చేసే మొద‌టి ప‌ని ఇదే..!

పాద‌యాత్ర ముగియ‌గానే జ‌గ‌న్ చేసే మొద‌టి ప‌ని ఇదే..!

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ రాష్ట్ర ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పాద‌యాత్ర పేరుతో చేస్తున్న పాద‌యాత్ర‌లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌వేడిని పెంచారు.ప్ర‌జా స‌మ‌స్య‌ల పరిష్కారంపై హామీలిస్తూ చంద్ర‌బాబు పాల‌న‌పై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు.

ఇవాళ ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం వ‌జ్ర‌పు కొత్తూరు మండ‌లంలోని నైట్రుక్యాంపు శిబిరం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అక్క‌డ్నుంచి హ‌రిపురం, అంబుగాం మీదుగా ఇచ్చాపురం నియోజ‌క‌వ‌ర్గం సోంపేట మండ‌లం, రాణిగాం మీదుగా మామిడిప‌ల్లి వ‌ర‌కు జ‌గ‌న్‌ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. అనంత‌రం పాత్ర‌పురం క్రాస్‌మీదుగా తుర‌కాసావ‌నం క్రాస్ వ‌ర‌కు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగించ‌నున్నారు.

అయితే, కొత్త ఏడాది ప్రారంభంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ముగించ‌నున్నారు. న‌వంబ‌ర్ 6, 2017 ఇడుపుల పాయనుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించిన జ‌గ‌న్ క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల మీదుగా మొత్తం 13 జిల్లాల్లో 133 నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 3,600 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర చేశారు.

ఈ నెల 9వ తేదీన శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో జ‌గ‌న్ యాత్ర ముగుస్తుంద‌ని ఇప్ప‌టికే వైసీపీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. పాద‌యాత్ర ముగింపునాడు జ‌గ‌న్ వైసీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కీల‌కంగా చెబుతున్న న‌వ‌ర‌త్నాల గురించి మ‌రోసారి ప్ర‌స్తావించ‌నున్నారు.

అయితే, జ‌న‌వ‌రి 9న ఇచ్చాపురంలో పాదయాత్ర ముగిసిన త‌రువాత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేరుగా తిరుప‌తికి చేరుకుంటార‌ని, అక్క‌డి నుంచి కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు చేరుకుని శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న త‌రువాత క‌డ‌ప ద‌ర్గాకు వెళ్లి అక్క‌డి నుంచి ఇడుప‌ల‌పాయ‌కు వెళ‌తార‌ని వైసీపీ శ్రేణులు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad