ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పని చేసి, తెరాసకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కాగా, ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
మీకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై మీ స్పందన అని అడిగిన మీడియాకు హరీవ్‌రావు సమాధానమిస్తూ.. తెరాసలో తానొక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే దానిని తూ.చ తప్పకుండా పాటిస్తానని, అమలు చేస్తానన్నారు. ఈ విషయాన్నే ఇప్పటి వరకు మీడియాకు పదులసార్లు చెప్పినట్లు హరీశ్‌రావు అన్నారు.
తన పేరుమీద తెలంగాణలో ఎటువంటి గ్రూపులు లేవని, సేనలు కూడా లేవని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఒక వేళ ఉన్నా వాటిని ఎవరూ కూడా సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. మంత్రి పదవి కేటాయించకపోవడంతో హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడంటూ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు విష ప్రచారం చేస్తున్నాయని, ఆ కథనాలన్నీ కూడా అవాస్తవాలన్నారు.