కేంద్రంకన్నా రాష్ట్రాలు ప్రవేశపెడుతున్న పథకాలే బాగున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కాగా, హైదరాబాద్ నగర పరిధిలోగల జూబ్లీహాల్లో జరుగుతున్న 15వ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రాలను సంప్రదించకుండానే ఉమ్మడి అంశాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతుందని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర అంశాలపై సమగ్ర అవగాహన అందరికీ అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచేలా ఆర్థికసంఘం సిఫార్సులు చేయాలని ఆయన కోరారు.