Home Latest News తెలంగాణ కేబినెట్ తొలి స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు ఇవే

తెలంగాణ కేబినెట్ తొలి స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు ఇవే

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు అధ్య‌క్ష‌త‌న రెండోసారి ప్ర‌భుత్వ ఏర్పాటు అనంత‌రం తొలి కేబినెట్ స‌మావేశం సోమ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో కేబినెట్ తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణయాలు మీ కోసం.

 • అసెంబ్లీ నామినేటెడ్ స‌భ్యుడిగా మళ్లీ స్టీఫెన్ స‌న్‌ను నియ‌మిస్తూ తీర్మానం చేసింది.
 • ఎమ్మెల్యేల‌తోపాటు నామినేటెడ్ స‌భ్యుడు ప్ర‌మాణ స్వీకారం చేసేలా నిర్ణ‌యం తీసుకుంది కేబినెట్‌.
  తాము తీసుకున్న ప్ర‌తిపాద‌న‌ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు పంపింది.
 • త్వ‌ర‌లోనే గెజిట్ కూడా విడుద‌ల కాబోతుంది.
 • ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా నిర్వ‌హించినందుకు ఎన్నిక‌ల సంఘం అధికార యంత్రాంగానికి కేబినెట్ అభినంద‌న‌లు తెలిపింది.
  అటు అసెంబ్లీ నిబంధ‌న‌ల ప్ర‌తులు, రాజ్యాంగ ప్ర‌తులను తెలుగు, ఇంగ్లీషు భాష‌ల్లో ఇవ్వాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.
 • సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వ‌హ‌ణ కోసం విధి విధానాల‌ను రూపొందించాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌కు సూచించారు.
 • కోటి ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా గోదావ‌రి, కృష్ణా బేసిన్‌ల‌లో రాష్ట్రానికి ఉన్న నీటి వాటాను ఉప‌యోగించుకునే వ్యూహం అమ‌లు చేయాలి.
 • తెరాస ప్ర‌భుత్వం వ‌స్తేనే ప్రాజెక్టుల‌న్నింటిని పూర్తిచేసి సాగునీటిని అందిస్తార‌నే విశ్వాసంతో ప్ర‌జ‌లు త‌మ‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చార‌ని, ప్రజ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాం.
 • ఈ ట‌ర్మ్‌లోనే అన్ని ప్రాజెక్టుల‌ను నూటికి నూరుశాతం పూర్తి చేస్తామ‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.
 • ప్రాజెక్టుల‌ను పూర్తిచేసేందుకు అధికారులు, వ‌ర్క్ ఏజెన్సీలు స‌హ‌క‌రించాలి.
 • కాళేశ్వ‌రం ప్రాజెక్టు మాదిరిగానే, పాల‌మూరు, రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని శ‌ర‌వేగంగా పూర్తి చేయాలి.
 • ప్రాజెక్టుల నిర్మాణానికి బ‌డ్జెట్‌లు నిధులు కేటాయించ‌డంతోపాటు ఇత‌ర ఆర్థిక‌సంస్థల నుంచి కూడా నిధుల‌ను సేక‌రిస్తాం
 • ప్రాజెక్టులు పూర్తైన త‌రువాత కూడా వాటి నిర్వ‌హ‌ణ కోసం అవ‌స‌ర‌మైన నిధుల‌ను బ‌డ్జెట్‌లో కేటాయిస్తాం.
- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad