టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సానియామీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ గా తప్పించాలని డిమాండ్ చేశారు. సానియామీర్జా పాక్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పాక్ వ్యక్తి అయిపోయారని అలాంటి సానియామీర్జా ను తెలంగాణ కు బ్రాండ్ అంబాసడర్ గా కొనసాగించడం సరికాదని రాజాసింగ్ వాఖ్యానించారు.
ఈ మేరకు రాజాసింగ్ విడుదల చేసిన వీడియో లో ఆయన సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసారు. సానియామీర్జా కు బదులుగా తెలంగాణ బిడ్డలైన పీవీ సింధూ, సైనా నెహ్వాల్ వంటి వారిని నియమించాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేసారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ .