అమెరికాలోని అడిజోనాలో అక్కడి పోలీసులు ఐసీస్ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. గత కొంతకాలంగా పోలీసులకు సవాల్ విసిరుతూ తప్పించుకు తిరుగుతున్న ఐసీస్ ఉగ్రవాది హమీద్‌ను కాల్చి చంపారు. ముందుగా ఆడిజోనాలోని ఓ షాపింగ్‌మాల్‌లోకి చొరబడ్డ ఉగ్రవాది అక్కడి మహిళా సిబ్బందిని బెదిరించాడు. ఆ తరువాత మెల్లగా మాల్ నుంచి బయటకు రాగానే పోలీసులను చూసి ఖంగుతిన్నాడు. తమ ఎదుట లొంగిపోవాలని ఉగ్రవాది హమీద్‌ను పోలీసులు ఆదేశించారు.
పోలీసులు ఎంత నచ్చచెప్పినా ఉగ్రవాది హమీద్ వినకపోగా ఘర్షణకు తలపడ్డాడు. వారిపై కత్తితో ఎటాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తన దగ్గర ఉన్న కత్తిని తీసి పోలీసులపైకి విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గన్‌తో షూట్ చేశారు. దీంతో స్పాట్లోనే హమీద్ ప్రాణాలను విడిచాడు. గత కొన్నేళ్లుగా ఇరాన్, ఇరాక్, పాలస్తీనాలో జరుగుతున్న వరుస పరిణామాలు తనను కలవరపాటుకు గురి చేసినట్లుగా ఉగ్రవాది హమీద్ చెప్పాడని అడిజోనా పోలీసులు వెల్లడించారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు ఇవాళ విడుదల చేశారు.