Home రాజకీయాలు మళ్ళీ తమిళనాడుకు కే‌సి‌ఆర్

మళ్ళీ తమిళనాడుకు కే‌సి‌ఆర్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో పది రోజుల గడువు ఉన్న సమయంలో మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై తెలంగాణ సీఎం కే‌సి‌ఆర్ జోరుగా చర్చలు సాగిస్తున్నారు. కేసీఆర్‌ ఇప్పటికే కరుణానిధితో పాటు తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా సమాఖ్య కూటమి(ఫెడరల్‌ ఫ్రంట్‌)తో పాటు ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. మళ్ళీ ఇవాళ (సోమవారం) తమిళనాడు విపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అవుతున్నట్లు తెలిసింది. కే‌సి‌ఆర్ ఆదివారం రాత్రి చెన్నై చేరుకున్నారు.

ప్రత్యేక విమానంలో కే‌సి‌ఆర్ వెంట ఆయన కుటుంబసభ్యులు, ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌ కూడా వున్నారు. సోమవారం ఉదయం సీఎం శ్రీరంగం, తిరుచ్చిలోని ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30కి డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు. గత వారం సీపీఎంకు చెందిన కేరళ సీఎం విజయన్‌తో కేసీఆర్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad