Home Latest News డీఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ నేడే..!

డీఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ నేడే..!

ఇటీవల త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న చేసి వ‌చ్చిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి చెన్నై వెళ్లారు. ఈ రోజు డీఎంకే అధినేత స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటులో వేగం పెంచిన కేసీఆర్ వెంట స్టాలిన్ న‌డుస్తా..? లేదా..? అన్న ప్ర‌శ్న‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర పార్టీల‌న్నింటిని ఏక‌తాటిపైకి తెచ్చి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసే ప‌నిలో ఉన్న కేసీఆర్, అందులో భాగంగా ఈ రోజు డీఎంకే అధ్య‌క్షులు స్టాలిన్‌ను
క‌ల‌వ‌నున్నారు.

కాగా, ఇటీవ‌ల సీఎం కేసీఆర్ కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే, ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేర‌ళ సీఎం విజ‌య‌న్‌తో భేటీ అయిన కేసీఆర్ రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించారు.ఆ త‌రువాత స్టాలిన్‌తో భేటీ అయ్యేందుకు కుద‌ర‌లేదు. అయితే, ఇద్ద‌రు నేత‌లు ముందుగా అనుకున్న ప్ర‌కారం నేడు భేటీ కానున్నారు. వీరిద్ద‌రి సమావేశంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad