Home Latest News ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు కేసీఆర్‌.. !

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు కేసీఆర్‌.. !

అవసరమైతే.. ప్రతిపక్షాలపై ఉప్పెనలా చెలరేగే కేసీఆర్ కు  ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసినంతగా దేశంలో ఇప్పుడున్న పొలిటికల్ లీడర్లలో ఎవరికీ తెలీదేమో.! ‘రైతుబంధు’, ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’ వంటి కేసీఆర్‌ తీసుకొచ్చిన పథకాలు యావత్ దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాయంటే ఆయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. వ్యూహాత్మకంగా అడుగులు వేసి తెలంగాణ ప్రజల దశాబ్దాల కల ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్‌.. తనదైన పాలనతో మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయ ఢంకా మ్రోగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత ఎంత ఇంపార్టెంట్ అనేది బాగా ఎరిగిన కేసీఆర్‌.. ఆ దిశ గానే పావులు కదిపి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టం అనేది లేకుండా చేసుకొచ్చారు. అంతేకాదు, ఇతర పార్టీలతోనూ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తూ తనదైన మార్కు చూపిస్తున్నారు.

తాజాగా.. జూరాల ప్రాజెక్టులో నీరు లేక, రక్షిత మంచినీటి పథకాలకు నీరు విడుదల చేసే పరిస్థితి లేక.. మండు వేసవిలో తాగునీటి కోసం అలమటిస్తున్న పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఆయన ముందుచూపుతో కర్ణాటకతో చేసిన దౌత్యం ఫలించింది. కేసీఆర్‌ విజ్ఞప్తి మేరకు నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటి విడుదలకు కర్ణాటక సీఎం అంగీకారం తెలిపారు. కేసీఆర్‌కు ఫోన్‌ చేసి మరీ చెప్పిన కుమారస్వామి రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటికీ ఇలాంటి వాతావరణమే కొనసాగాలని కాంక్షించారు.

ఇలావుంటే.. కర్ణాటక సీఎం కుమారస్వామి సానుకూలంగా స్పందించడం వెనుక ఒక కారణం ఉంది. గత ఏడాది కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు తుంగభద్ర జలాల్లో ఆర్డీఎస్‌ వాటా నుంచి ఒక టీఎంసీ నీటిని కర్ణాటక వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ కోసం జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని కర్ణాటక ఇస్తోంది. దీంతో నారాయణపూర్‌ నుంచి రెండున్నర టీఎంసీల నీటిని కర్ణాటక ప్రభుత్వం నేడో, రేపో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా వాసుల నీటి కష్టాలూ తీరనున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad