Home Latest News టీడీపీదే అధికారం.. స్ప‌ష్టం చేసిన పీకే టీమ్‌..!?

టీడీపీదే అధికారం.. స్ప‌ష్టం చేసిన పీకే టీమ్‌..!?

మే 23న జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ త‌రువాత టీడీపీ మ‌ళ్లీ అధికారం చేప‌ట్ట‌నుంద‌ని, చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌నున్నార‌ని మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. కాగా, అమ‌రావ‌తిలోని టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంత్రి దేవినేని ఇవాళ మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో వైసీపీ ఎన్ని కుట్ర‌లు, కుతంత్రాలు చేసినా ఓట‌ర్లు పెద్దఎత్తున తిర‌గ‌బ‌డి టీడీపీకి అండ‌గా నిలిచారన్నారు.

ఇదే సంద‌ర్భంలో ఓటింగ్ ముగిసిన అనంత‌రం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను మంత్రి దేవినేని రివీల్ చేశారు. జ‌గ‌న్ చెప్తున్న‌ట్టు సీఎంగా ప్ర‌మాణ స్వీకార తేదీని దేవుడే నిర్ణ‌యిస్తాడ‌న్న వ్యాఖ్య‌ల‌పై మంత్రి దేవినేని సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. దేవుడిపై భారం వేశాడంటే వైసీపీకి అధికారంలోకి వ‌స్తామ‌న్న న‌మ్మ‌కం లేద‌న్న విష‌యం స్ప‌ష్టం అవుతుంద‌న్నారు. ప్ర‌శాంత్ కిశోర్ సాయంతో వైఎస్ జ‌గ‌న్ బీహార్ త‌ర‌హా రౌడీ రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తున్నారని, వాటిని గ‌మ‌నించిన ప్ర‌జ‌లు అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఓటింగ్‌లో పాల్గొని టీడీపీకి మ‌ద్ద‌తు తెల‌ప‌డం సంతోష‌క‌ర ప‌రిణామమ‌న్నారు.

మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల త‌రువాత అధికారం టీడీపీదేన‌న్న విషయాన్ని ప్ర‌శాంత్ కిశోర్ టీమ్‌లోని ఓ స‌భ్యుడు త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడ‌ని, జ‌గ‌న్ పూర్తి స్థాయిలో న‌మ్మిన వ్య‌క్తులే అలా పోస్టులు పెట్ట‌డం చూస్తుంటే వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త ఉంద‌న్న విష‌యం అర్ధ‌మ‌వుతుంద‌ని మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad