Home Latest News జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. ఆత్మ విమ‌ర్శ చేసుకో : ఎమ్మెల్యే బోండా ఉమా

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. ఆత్మ విమ‌ర్శ చేసుకో : ఎమ్మెల్యే బోండా ఉమా

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రు కాక‌పోవ‌డాన్ని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా త‌ప్పు బ‌ట్టారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లపై చ‌ర్చించి, ప‌రిష్క‌రించేందుకు వంద‌శాతం అవ‌కాశాలు ఉన్న అసెంబ్లీ స‌మావేశాల‌కు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజ‌రడం ప్ర‌జాస్వామ్య విరుద్ద‌మ‌న్నారు.

కాగా, ఎమ్మెల్యే బోండా ఉమా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న వారికి రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే బుద్ధి చెప్తార‌న్నారు. ఆ క్ర‌మంలోనే గ‌త నాలుగన్నారేళ్లుగా రాష్ట్రంలో ప్ర‌జారంజ‌క పాల‌న అందించిన టీడీపీకే ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని, దాదాపు 150 అసెంబ్లీ సీట్ల‌ను టీడీపీ కైవ‌సం చేసుకోబోతుందంటూ ఎమ్మెల్యే బోండా ఉమా జోస్యం చెప్పారు.

కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట విని వైసీపీ ఎమ్మెల్యేలంతా స‌భ‌కు హాజ‌రు కావ‌డం లేద‌ని, జ‌గ‌న్ వ్య‌క్తిత్వ‌మే వైసీపీ వినాశ‌నానికి కార‌ణ‌మ‌వుతుంద‌న్నారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మోసాన్ని గుర్తించి తేరుకున్న కొంద‌రు వైసీపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నార‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad