ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా తాను పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థిల్లోను ప్రోత్సహించనని తమ్మినేని సీతారం అన్నారు. రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలతో ఫిరాయింపులకు పాల్పడేవారిపై వేటు వేస్తానని తేల్చి చెప్పారు. తాను స్పీకర్‌గా ఉన్న సమయంలో అటువంటి సమస్య రానే రాదని చెప్పుకొచ్చారు. ఫిరాయింపుల విషయంలో కఠినంగా ఉండి దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తానని స్పీకర్ అన్నారు.
రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయించిన వాళ్లను ప్రజా నాయకులుగా రద్దు చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పారు. ఇతర పార్టీల నుంచి వారిని వైసీపీలోకి తీసుకునేది లేదని సీఎం జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా చెప్పారని, అసెంబ్లీ సాక్షిగా ఆ మాట చెప్పారని స్పీకర్ గుర్తు చేశారు.