లండన్‌లో వెస్టిండీస్ X ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఒక బీభత్సమైన ఘటన జరిగింది. క్రికెట్ చూసిన వాళ్లకే కాదు, సాక్షాత్తూ అంపైర్‌కు కూడా దిమ్మతిరిగిపోయింది. తేరుకున్న జనం పడిపడి నవ్వుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్ కేట్ క్రాస్ వేసిన బంతిని విండీస్ బ్యాటర్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించింది.
ఆ బ్యాటర్ నాన్‌స్ట్రైకింగ్ వైపు పరుగెడుతుండగా ఫీల్డర్ బంతిని అందుకొని స్టంపౌట్ చేయకుండా బౌలర్‌కి త్రో చేసింది. ఆమె తనవైపు వస్తున్న బ్యాటర్‌ని గమనించకుండా కీపర్ వైపు పరుగెడుతున్న బ్యాటర్‌ని ఔట్ చేసేందుకు త్రో విసిరింది. ఆమె చేసిన పొరపాటు వీడియోలో పూర్తి వినోదభరితంగా ఉండడంతో నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 42 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
Women’s cricket ☕️🐸 pic.twitter.com/ioD0j3ZbBx
— J Bluenose (@NorseSon) June 21, 2019