తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుకోని షాక్ ఇచ్చింది. పులి పంజా విసిరిన మాదిరి ఈ రోజు సుజనా చౌదరి ఆస్తులపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అయితే, చెల్లని పత్రాలతో బ్యాంకు అధికారులను మోసగించి భారీ మొత్తంలో రుణాలు పొందారని, వాటిని తిరిగి చెల్లించనందున వైశ్రాయ్ హోటల్స్కు చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన్టటు ఈడీ అధికారులు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా రాజ్యాంగపర హోదాలో ఉన్న సుజనా చౌదరి డొల్ల కంపెనీలను స్థాపించడం, ఆ కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం, ఆ రునాలను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడం వంటి ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. సుజనా చౌదరిపై మరికొన్ని ఆర్థికపరమైన కేసులు నమోదై ఉన్నాయని, విచారణలో నిజా నిజాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.