Home General ఇటువంటి ప‌రిస్థితి ఏ త‌ల్లీదండ్రుల‌కు రాకూడ‌దు..!

ఇటువంటి ప‌రిస్థితి ఏ త‌ల్లీదండ్రుల‌కు రాకూడ‌దు..!

జీవితం చ‌ర‌మాంకంలో ఉన్న స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల‌ను ప్రేమ‌గా చూసేది ఆడ‌బిడ్డ‌నే. అందుకే నాకు ఆడ బిడ్డే పుట్టాల‌ని కోరుకుంటున్నా అంటూ ప్ర‌తీ త‌ల్లి తాను గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో అనుకోవ‌డం స‌హ‌జం. కానీ, అంద‌రూ ఆడ బిడ్డ‌లు అలా ఉండ‌ర‌ని ఓ మ‌హిళ నిరూపించింది. ఈ సంఘ‌ట‌న‌కు అస‌లు వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే మ‌నం క‌ర్ణాట‌క నుంచి ఆస్ట్రేలియా వ‌ర‌కు ట్రావెల్ చేయాల్సిందే మ‌రీ..!

మృత్యుంజ‌య‌, కృష్ణ‌కుమారి ఇద్ద‌రూ దంప‌తులు. వీరు క‌ర్ణాట‌క కృష్ణ‌రాజ‌పురం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఒక‌రు అబ్బాయి పేరు వ‌రుణ్ కాగా, మ‌రొక‌రు అమ్మాయి గీతామ‌ణి. దంప‌తులు మృత్యుంజ‌య‌, కృష్ణ‌కుమారి దంప‌తులిద్ద‌రూ త‌న కుమార్తె గీతామ‌ణికి గ‌త కొన్నేళ్ల క్రిత‌మే వివాహం చేశారు. వ‌రుడు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నందున పెళ్లి త‌రువాత కూడా అక్క‌డే స్థిర‌పడ్డారు.

అంతేకాకుండా, వారి వివాహ బంధానికి ఫ‌లితంగా గీతామ‌ణికి ఇద్ద‌రు సంతానం. త‌న కూతురు త‌మ‌ను అమ్మ‌మ్మ‌, తాత‌ల‌ను చేసింద‌ని సంబ‌ర‌ప‌డిపోయిన మృత్యుంజ‌య‌, కృష్ణ‌కుమారిల‌ ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. త‌న పిల్ల‌ల బాగోగులు చూసుకునేంఉద‌కు మీరు కూడా మాతోపాటు ఆస్ట్రేలియా రావాలంటూ త‌ల్లిదండ్రును అడిగిన గీతామ‌ణికి వారి నుంచి నో అనే స‌మాధానం వ‌చ్చింది. మాకు ఆస్ట్రేలియా వాతావ‌ర‌ణం స‌ర‌పడ‌దు. అక్క‌డ ఉండ‌లేము. అందులోను మాది ఇప్పుడు కాల‌ధ‌ర్మం చేసే వ‌య‌సు. ఈ వ‌య‌సులో అక్క‌డికి వ‌చ్చి మిమ్మ‌ల్ని ఇబ్బందిపెట్ట‌లేమంటూ గీతామ‌ణికి వృద్ధ దంప‌తులైన మృత్యుంజ‌య‌, కృష్ణ‌కుమారిలు చెప్పారు.

అయినా, వారి మాట‌ల‌ను లెక్క‌చేయ‌క గీతామ‌ణి త‌న త‌ల్లి కృష‌ష్ణ‌కుమారిని మాయ‌మాట‌ల‌తో ఒప్పించి మ‌రీ ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది. తీరా అక్క‌డ‌కు వెళ్లిన కృష్ణ‌కుమారికి త‌న కూతురు గీతామ‌ణి నుంచే వేధింపులు ఎదుర‌య్యాయి. క‌ర్ణాట‌క‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించిన త‌ల్లికి కూతురు గీతామ‌ణి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఆమె నానా ఇబ్బందుల‌కు గురైంది. చివ‌ర‌కు త‌ల్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించి జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మ‌రోప‌క్క కుమారుడు వ‌రుణ్ కూడా వృద్ధాప్యంలో ఉన్న త‌న బాగోగుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఆస్ట్రేలియాలో త‌న కూతురు బంధీలో ఉన్న త‌న భార్య‌ను వెంట‌నే ఇండియాకు ర‌ప్పించాల‌ని కోర్టులో కేసు వేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad