Home Latest News కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేపై రాళ్ల‌దాడి..!

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేపై రాళ్ల‌దాడి..!

ఇల్లెందు ఎమ్మెల్యే హ‌రిప్రియ‌పై రాళ్ల‌దాడి జ‌రిగింది. కామేప‌ల్లి మండ‌లం గోవింద‌రాల గ్రామంలో జరిగిన ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ టికెట్‌పై ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలుపొందిన హ‌రిప్రియ ఇటీవ‌ల అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఈ రోజు ఆమె టీఆర్ఎస్ త‌రుపున గోవింద‌రాల గ్రామంలో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించేందుకు వెళ్లారు. ఆమె పార్టీ మార‌డంపై తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అదునుచూసి ఆమెపై రాళ్ల‌దాడి చేశారు.

హ‌రిప్రియ ల‌క్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు చేసిన రాళ్ల‌దాడికి టీఆర్ఎస్ వ‌ర్గాలు సైతం ఎదురు తిరిగి ప్ర‌తిదాడులు చేశాయి. దీంతో ఇరువ‌ర్గాల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికుల ద్వారా స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఇరువ‌ర్గాల దాడిలో గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాంగ్రెస్ శ్రేణుల దాడిపై స్పందించిన ఎమ్మెల్యే హ‌రిప్రియ మాట్లాడుతూ.. నెలన్న‌ర రోజులుగా తాను అన్ని మండ‌లాల్లో తిరుగుతున్న‌ప్ప‌టికి కేవ‌లం గోవింద‌రాల గ్రామంలోని ఒక వ‌ర్గానికి చెందిన వారు మాత్ర‌మే కక్ష‌క‌ట్టి మ‌రీ రాళ్ల‌దాడి చేశార‌న్నారు. ఈ విష‌యాన్ని ఇల్లెందు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రూ కూడా గ‌మ‌నించాల‌ని ఆమె కోరారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad