కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటీలో ఉన్న సమయంలో ఒక డ్యాన్సర్ వృత్తిని కొనసాగించేది.. రాజీవ్ గాంధీని ఆమెను పెళ్లి చేసుకుని భారత్కు తీసుకొచ్చారు.. కనుక ఇప్పుడు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా డ్యాన్సర్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.. ఆ క్రమంలోనే హర్యానాకు చెందిన డ్యాన్సర్ స్వప్నా చౌదరిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాగా, సురేంద్ర సింగ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. డ్యాన్స్నే వృత్తిగా భావించిన సోనియా గాంధీకి దేశ బాధ్యతలు అప్పగించడం ఇష్టంలేకనే గత ఎన్నికల్లో నరేంద్ర మోడీకి ప్రధాని పదవిని కట్టబెట్టారన్నారు. దేశాన్ని నరేంద్ర మోడీ అయితేనే ముందుకు నడిపించగలడన్న నమ్మకం ప్రజల్లో ఇంకా ఉంద్నారు.
అయితే, సురేంద్ర సింగ్కు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్తకాదు. గతంలో మాయవతిని టార్గెట్గా చేసుకుని ఆమె మొఖానికి ఫేషియల్ లేనిదే బయటకు రాదని, జుట్టుకు నల్లరంగు పూసుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు హిందువులు కనీసం ఐదుగురేసి పిల్లలను కనాలన్న ఆయన తాజాగా సోనియా గాంధీ డ్యాన్సర్ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.