Home Latest News త్వ‌ర‌లో మ‌రో రూ.8 వేల కోట్ల రుణ‌మాఫీ : మ‌ంత్రి సోమిరెడ్డి

త్వ‌ర‌లో మ‌రో రూ.8 వేల కోట్ల రుణ‌మాఫీ : మ‌ంత్రి సోమిరెడ్డి

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన రైతుల‌కు రుణ‌మాఫీ హామీపై ఇవాళ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌తో పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి సాయం చేయాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం క‌క్ష సాధింపుల‌కు దిగింద‌ని, చివ‌ర‌కు నూత‌న రాష్ట్ర అభివృద్ధికి నిధులు స‌మ‌కూర్చి స‌హ‌క‌రించాల‌ని సీఎం చంద్రబాబు కోరినా, కేంద్ర ప్ర‌భుత్వం ముఖం చాటేయ‌డం బాధాక‌రమ‌న్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రించ‌కున్నా, రాష్ట్ర ప్ర‌భుత్వంపై అప్పుల భారం ఉన్నా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని 23.76 ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.24 వేల కోట్ల మేర రుణాల‌ను మాఫీ చేశామ‌ని చెప్పారు. అలాగే, రూ.50 వేల లోపు రుణం తీసుకున్న 2.39 ల‌క్ష‌ల మంది కౌలు రైతుల‌కు సంబంధించిన రుణాల‌ను సైతం మాఫీ చేశామ‌ని చెప్పారు.

అయితే, కొంత మంది రైతులు రుణ మాఫీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప‌త్రాలు స‌రిగ్గా లేనందున అర్హులుగా న‌మోదు కాలేక పోయార‌ని, వారంద‌రి స‌మ‌స్య‌ల‌ను గ్రీవెన్స్ సెల్‌లో ప‌రిష్క‌రించి వారికి కూడా రూ.52.45 కోట్ల మేర రునాల‌ను మాఫీ చేసిన‌ట్లు తెలిపారు. మ‌రో 8 వేల కోట్ల రూపాయ‌ల రుణ మాఫీ చేసేందుకు స‌ర్కార్ సిద్ధంగా ఉంద‌ని, ఆ ప్ర‌తిపాద‌న‌ను ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ముందే జ‌రుగుతుంద‌న్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad