శంకర్ డైరెక్షన్లో కమలహాసన్ హీరోగా మొదలైన భారతీయుడు 2 సినిమాకి కష్ఠాలు మళ్ళి మొదలయ్యాయి. దర్శకుడు శంకర్ కి నిర్మాతల మధ్య గొడవ జరిగిందట ఈ సారి ఈ సినిమా మొత్తానికి అటకెక్కనుంది అని టాక్ మొదలైనది. కమలహాసన్ హీరోగా శంకర్ తీస్తున్న భారతీయుడు 2 అప్పుడే కష్టాలో పడింది. అందరూ ఊహించినట్టుగా బడ్జెటే ఈ సినిమాకి శాపంగా మారిందని కోలీవుడులో తాజా టాక్ ప్రకారం ఈ సినిమాని నిర్మాతలు మొత్తంగా పక్కన పెట్టనున్నారట.
శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన 2.ఓ చిత్రం విడుదలైన రెండు నెలల తర్వాత భారతీయుడు 2 సినిమా షూటింగ్ ను దర్శకుడు శంకర్ షురూ చేసాడు. ప్రారంభమైంన నెల రోజులకె ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. కొత్త షెడ్యూల్ మొదలు పెట్టేముందు నిర్మాతలు చేతులేతేశారుట. భారతీయుడు సినిమాకు సీక్వెల్ భారతీయుడు2 రెండు దశాబ్దాల క్రితం విడుదలైన భారతీయుడు సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడు కమలహాసన్ కు పెద్దగా మార్కెట్ లేదు అయన సినిమాలేవీ 50 కోట్ల రూపాయల వసూళ్లు అందుకోవటం లేదు.
ప్రస్తుతం శంకర్ మాత్రమే బిసినెస్ ఫ్యాటప్ వ్యూలో స్టార్ అని చెప్పాలి. అయితే శంకర్ తన సినిమాలకి భారీగా బడ్జెట్ పెంచేస్తున్నాడు 2.ఓ లో అదే జరిగింది. తెలుగు వర్షన్లో 25కోట్లు తమిళ వర్షన్లో 100 కోట్లు నష్టం వచ్చింది నిర్మాతలకి. అందుకే 2,ఓ లాగా ఈ సినిమా నష్టాలు రాకూడదని ముందు జాగ్రత్తగా ఎంత బడ్జెట్ లో సినిమాను పూర్తి చేస్తారు. ఎన్ని రోజులో తీసి ఎప్పుడు విడుదల చేస్తారని , విషయంలో పక్కాగా అగ్రిమెంట్ చేసుకోవాలని లైకా సంస్థ నిర్మాతలు శంకర్ ను కోరారట చెప్పిన బడ్జెట్ లో పూర్తీ చేయాలనీ చెప్పిన అగ్రిమేట్ లో శంకర్ ఒప్పుకోవటం లేదట దాంతో ఇప్పుడు ఈ సినిమా సమస్యలో పడింది.
భారతీయుడు2 సినిమాను మొదట టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించడానికి ముందుకు వచ్చాడు అయితే శంకర్ చెప్పిన బడ్జెట్ కమలహాసన్ అడిగిన పారితోషకము విని దిల్ రాజు షాక్ తిన్నాడు. తాను అంత బడ్జెట్ పెట్టి తీయలేని బయటకు వచ్చేశాడు. ఆ తరువత 2.ఓ ను నిర్మించిన లైకా సంస్థ ఈ సినిమాను తీయడానికి ముందు కు వచ్చింది కానీ 2.ఓ మిగిల్చిన నష్టాలతో ఆ సంస్థ మేల్కొంది చెప్పిన బడ్జెట్ లో తీస్తాను అంటేనే ముందుకు కదులుదాం అని అంటుందట. మరి ఈ సినిమా ఆగిపోతుందా లేక శంకర్ రాజి పడతాడ చూడాలి.