వైసీపీ అధినేత వైఎస్ జగన్కు బీసీలందరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వేదికగా వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలో ఇవాళ అనీల్ కుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తన నాలుగున్నారేళ్ల పాలనలో బీసీలను అన్ని విధాలా మోసగించారన్నారు. సీఎం చంద్రబాబు అస్తమించే సూర్యుడితో సమానమని, ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనన్నారు.
బీసీలను అన్ని విధాలా ఆదుకునేందుకు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ను ప్రకటించనున్నారన్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ లానే వైఎస్ జగన్ కూడా ప్రజారంజక పాలన కొనసాగిస్తారన్న నమ్మకం కలిగిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్తో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని అనీల్ ఉమార్ యాదవ్ అన్నారు.