బంపరాఫర్ కొట్టేశాడు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తొలిసినిమా అర్జున్ రెడ్డితో టాలీవుడ్లోనేకాదు, జాతీయ స్థాయిలో సంచలనమైన సందీప్ రెడ్డి.. అదే సినిమాను బాలీవుడ్‌కు అందించి హిందీ ఇండస్ట్రీలోనూ సూపర్ సక్కెస్ అయ్యాడు. అర్జున్ రెడ్డి రీమేక్‌గా బాలీవుడ్లో తెరకెక్కిన కబీర్ సింగ్ ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఏడాది టాప్ 3 గ్రాసర్స్‌లో నిలువబోతోంది. దీంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నజర్ సందీప్‌రెడ్డి మీద పడింది. ఇప్పుడు సందీప్‌తో ఏకంగా సినిమా చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఈ మూవీని టీ సిరీస్ సంస్థ నిర్మించబోతున్నట్టు సమాచారం.