ఎన్నికల జాతకం చెప్పే సబ్బం హరి.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో తన జాతకం చూపించుకోకుండా బరిలో దిగారన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడక ముందు ఆయన చెప్పిన జోస్యాలు అపహాస్యంపాలయ్యాయి. దాంతో రిజల్ట్ తరువాత ఆయన అడ్రస్ లేకుండా పోయారు. ఆ క్రమంలో ఈ విశాఖ ఆక్టోపస్ ఎక్కడ..? ఎవరికి..? జోస్యం చెబుతున్నారోనన్న సెటైర్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మీడియా ముందుకొచ్చి ఏపీ టీడీపీ భారీగా ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుంటుందని, మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని జాతకచక్రంవేసి మరీ మాజీఎంపీ సబ్బం హరి జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే.
అదే సందర్భంలో వైసీపీ అధినేత జగన్‌పై సైతం సెటైర్లతో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, జగన్‌పై ఏపీ ప్రజలకు నమ్మకం లేదని, జగన్ గెలుపొందితే ఏపీ ఎప్పటికీ అభివృద్ధి చెందదని తనదైన రీతిలో జాతకచక్రం విప్పారు సబ్బం హరి.
అంతేకాకుండా తాను భీమిలి టీడీపీ టికెట్‌పై బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ సబ్బం హరి నాడు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఆయన జోస్యం వికటించి సీన్ మొత్తం మారిపోయింది. దాంతో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో..? ఎవరి జాతకం చెబుతున్నాడోనని..? విశాఖ పొలిటీషియన్స్ సెటైర్లు విసురుతున్నారు.