Home Latest News ఆ కాంగ్రెస్ నేత‌పై వేటు ప‌డింది..!

ఆ కాంగ్రెస్ నేత‌పై వేటు ప‌డింది..!

తెలంగాణ పీసీసీ ఆ పార్టీ నేత న‌గేష్ ముదిరాజ్‌పై వేటు వేసింది. న‌గేష్ ముదిరాజ్ పార్టీ నియ‌మ నిబంధ‌లను ఉల్లంఘించారంటూ పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ కాంగ్రెస్ చ‌ర్య‌లు తీసుకుంది. కాగా, గాంధీ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన టీ.కాంగ్రెస్ క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ న‌గేష్‌, వీహెచ్‌తోపాటు పార్టీ ఇచ్చిన స‌మాచారంపై చ‌ర్చించింది. న‌గేష్ పార్టీ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించాడ‌ని భావించిన క‌మిటీ వేటు వేసింది. క్ర‌మ శిక్ష‌ణ ఉల్లంఘిస్తే ఎవ‌రిపైనైనా చ‌ర్య‌లు ఉంటాయ‌ని టీ.కాంగ్రెస్ క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ తెలిపింది.

కాగా, మూడు రోజుల కిందట ఇందిరా పార్కు వ‌ద్ద అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అదే సంద‌ర్భంలో స‌భపై కుర్చీ విష‌యంలో న‌గేష్‌, వీహెచ్ మ‌ధ్య మాటా.. మాటా పెరిగింది. దీంతో ఇరువురు నేత‌లు కూడా చొక్కాలు ప‌ట్టుకుని మ‌రీ వేదిక‌పైనే కొట్టుకున్నారు. ప‌ర‌స్ప‌రం తోపులాట‌లో వీహెచ్‌తో స‌హా న‌గేష్ కూడా కింద‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అక్క‌డ కాసేపు ఉద్రిక్త‌త‌ను పెంచింది. ఈ క్ర‌మంలోనే వీహెచ్‌, నగేష్ వాద‌న‌ల‌ను విన్న త‌రువాత న‌గేష్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad