సిద్దిపేట ఒక షాపింగ్ మాల్ లో తొక్కిసలాట జరిగింది. పది రూపాయలకే చీర ఆఫర్ పెట్టడంతో మహిళలు భారీ సంఖ్యలో వచ్చేశారు దీంతో అక్కడి షాపింగ్ నిర్వాహకులు మాల్ గేట్లు తెరవడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాలు… ప్రకారం ప్రస్తుతం ఎలాంటి పండుగలు కూడా లేవు పండగల సమయంలో పెట్టాల్సిన ఆఫర్స్ ల కాకుండా మాల్ వారు తమ వద్ద ఉన్న పాత స్టాక్ ను తీసివేయడానికి పది రూపాలకే అని CMR షాపింగ్ మాల్ వారు సిద్దిపేట లో గత మూడు రోజుల నుంచి పది రూపాలకే చీరలు అని ఈ ఆఫర్ పెట్టారు. సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టిన షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు.
దీంతో పేద మధ్యతరహతి మహిళలు భారీ సంఖ్యలో ప్రతి రోజు చీరలు కొనడానికి ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. రోజు లాగానే ఈ రోజు కూడా ఈ షాపింగ్ మాల్ కు రావడం జరిగింది. అయితే ఈ రోజు సుమారుగా 500 కు పైగా మహిళలు రావడం వచ్చారు. దీంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు ఒకసారిగా మాల్ గేట్లు తెరవడంతో మహిళలు ఒకరిని ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దింతో చాల మందికి గాయాలు అయ్యాయి.
ఈ తొక్కిసలాట లో చాలా మంది మహిళల ల ఒంటి పైన నగలు కూడా పోయాయి. ఫోన్స్ కూడా పోయాయి. ముఖ్యంగా ఒక మహిళా మేడలో నుంచి 5 తులాల బంగారం పోయిందని , మరి కొంత మంది పర్సులు పోయాయని సరిగా ఏర్పాట్లు చేయకుండా ఇబ్బంది పెట్టారని షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.