Home General పేక ముక్క‌ల‌ను ర‌ఫ్పాడిచ్చేస్తాడట‌..!

పేక ముక్క‌ల‌ను ర‌ఫ్పాడిచ్చేస్తాడట‌..!

కొంద‌రు అద్భుతాలు సృష్టించేందుకే పుడ‌తారు అన్న మాట మ‌న పెద్దలు ఊరికే అన‌లేదు. వారి జీవితాల్లో జ‌రిగిన, చూసిన‌, అనుభ‌వాల దృష్ట్యా ఆ మాట‌ అని ఉంటార‌న్న స‌త్యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాలా..? కాదు క‌దా..! మ‌న పెద్ద‌లు అన్న ఆ మాట‌ను రుజువు చేస్తూ ఓ బుడ‌త‌డు త‌న చిరు ప్రాయంలోనే అద్భుతాలు సృష్టించ‌లేక పోయినా ఏదో త‌న స్థాయికి త‌గ్గ‌ట్టు పెద్ద పెద్ద ప‌నులు చేస్తూ అంద‌ర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

ఏకంగా న‌ట రుద్రుడు ఎన్టీఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం అర‌వింద స‌మేత‌లోని ఓ డైలాగ్‌తో ముడి పెడుతూ ట్యాగ్‌లైన్‌ల‌ను జ‌త చేస్తున్నాడు. ఆరేళ్ల బుడ‌త‌డు పెద్ద పెద్ద డంబిల్స్‌తో జిమ్‌లో వ్యాయామం చేస్తే ఎలా ఉంటాదో తెలుసా..? ఆరేళ్ల బుడ‌త‌డు బ్రీఫ్ కేస్ ప‌ట్టుకుని చేతికి వాచ్‌, మెడ‌కు టై, ట‌క్ చేసుకున్న ద‌స్తుల‌తో ఆఫీసుకు వెళ్తే ఎలా ఉంటాదో తెలుసా..? అదే ఆరేళ్ల బుడ‌త‌డు పేకాట‌క్ల‌బ్‌లో పేక‌లు చేత ప‌డితే ఎలా ఉంటాదో తెలుసా..? గొడ్డ‌లి చేతప‌ట్టి చెట్టును న‌రికితే ఎలా ఉంటాదో తెలుసా..? అంటూ క్వ‌శ్చ‌న్ మార్క్‌ల‌తో ట్యాగ్‌ల‌ను జ‌త చేస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యేలా ఫోటోల‌ను పోస్టు చేశాడు.

ఇన్ని ఫోటోల‌తోపాటు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ డైలాగ్‌ల మాదిరి ట్యాగ్‌లైన్‌ల‌ను జ‌త చేసిన ఆ బుడ‌త‌డు నిజంగానే ఆ ప‌నుల‌న్నీ చేశాడా..? అన్న ప్ర‌శ్న మీలో త‌లెత్తితే అందుకు ఆ బుడ‌త‌డి తండ్రి మాట్ మాక్మిలాన్ చెప్పే స‌మాధానం మీరు త‌ప్ప‌కుండా చ‌ద‌వాల్సిందే.

త‌న‌కు, త‌న భార్య దాంప‌త్య జీవితంలో సంతాన భాగ్యం క‌లిగేందుకు చాలా ఏళ్లు ప‌ట్టింద‌ని, లేక లేక పుట్టిన త‌న బిడ్డ రియాన్‌ను అల్లారు ముద్దుగా చూసుకోవాల‌న్న కోరిక బ‌లంగా ఉండ‌టంతో నాకున్న ఫోటో షాప్ పరిజ్ఞానంతో ఫోటో మార్ఫింగ్‌లు చేసి సోష‌ల్ మీడియాలో పెట్టిన‌ట్లు చెప్పుకొచ్చారు. తాను ఫోటో షాప్‌లో చేసిన ఫోటోల‌న్నీ కూడా రియాల్టీకి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో అందరూ వాటిని నమ్ముతున్నార‌ని, తన కొడుకుకు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్ప‌డింద‌ని ఆ బాలుడి తండ్రి చెప్పారు.

b

c

d

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad