Home Latest News రివ్యూ : 314 రోజుల‌ జ‌గ‌న్ పాద‌యాత్ర హైలెట్స్ ఇవే..!

రివ్యూ : 314 రోజుల‌ జ‌గ‌న్ పాద‌యాత్ర హైలెట్స్ ఇవే..!

341 రోజులు 3648 కిలో మీట‌ర్ల సుదీర్ఘ ప్ర‌యాణం. జ‌నం స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ నేనున్నానంటూ ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తూ సాగింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌. ఒక్క అడుగులో మొద‌లై వేల కిలోమీట‌ర్లుగా సాగిన జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో పూర్తి కానుంది.

2017 న‌వంబ‌ర్‌లో పాద‌యాత్ర‌ను మొద‌లుపెట్టిన జ‌గ‌న్ 3648 కిలోమీట‌ర్లు న‌డిచారు. పాద‌యాత్ర ప్రారంభ‌మైన త‌రువాత వైసీపీ నేత‌లు, శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఇవాళ ఇచ్చాపురంలో పైలాన్‌ను ఆవిష్క‌రించ‌డంతోపాటు భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్నారు.

క‌డప జిల్లా ఇడుపుల‌పాల‌య‌నుంచి 2017 న‌వంబ‌ర్ 6న జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను మొద‌లుపెట్టారు. రాష్ట్రంలోని 2,516 గ్రామాల మీదుగా సాగిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో 124 బ‌హిరంగ స‌భ‌లు జ‌రిగాయి. 231 మండ‌ల కేంద్రాలు, 54 మున్సిపాలిటీలు, ఎనిమిది న‌గ‌రాలు, మ‌హాన‌గ‌రాల మీదుగా సాగిన జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా నీరాజ‌నాలు ప‌లికారు.

పాద‌యాత్ర గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశించిన స‌మ‌యంలో క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి జ‌న‌ప్ర‌వాహంతో నిండిపోయింది. అలాగే తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేరుకున్న స‌మ‌యంలో రాజ‌మండ్రి వ‌ద్ద గోదావ‌రి పైనున్న రైల్వే కం. రోడ్డు బ్రిడ్జీ జ‌న‌వ‌రిధిగా మారింది. అంతేకాకుండా, విశాఖ‌లో కంచ‌ర‌పాలెంలో జ‌రిగిన స‌భ మైలురాయిగా నిలిచింది.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడిని ర‌గిల్చింది. ప్ర‌త్యేక హోదా అంశాన్ని రాజ‌కీయ అజెండాగా మార్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో త‌మ పార్టీ అధికారంలోకి రాగానే చేప‌ట్ట‌నున్న ప‌లు కార్య‌క్ర‌మాల గురించి పాద‌యాత్ర సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌స్తావించారు.

వైఎస్ఆర్‌సీపీ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల హామీల ద్వారా ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు. తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంప‌డంతోపాటు కాపుల‌ను ఆదుకునేందుకు ఏటా రూ.10వేల కోట్ల‌ను కేటాయిస్తామ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న చేశారు.

న‌ష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం కాంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ విధానాన్ని ర‌ద్దు, ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల భ‌ర్తీ మెగా డీఎస్సీ త‌దిత‌ర హామీల‌ను జ‌గ‌న్ ఇచ్చారు. చ‌క్కెర క‌ర్మాగారాల పున‌రుద్ధ‌ర‌ణ‌, తిత్లీ తుఫాన్ బాధితుల‌కు ప‌రిహారం మొత్తాన్ని చెల్లిస్తామ‌ని చెప్పారు.

పాద‌యాత్ర సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఆ విష‌యంపై రాష్ట్రంలో రాజ‌కీయ చ‌ర్చ ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. ఈ కేసును ఇటీవ‌లే వైసీపీ నేత‌ల ఫిర్యాదు మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఎన్.ఐ.ఏకు అప్ప‌గించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad