పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీని వీడనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే నరసాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ఆయన ప్రకటించారు.
క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న తాను ప్రజాసేవ చేయాలన్న నిర్ణయంతోనే పోటీకి దిగుతున్నట్టుగా ఆయన చెప్పారు. అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన తన ప్రకటన చేశారు. త్వరలోనే కాపు కార్పొరేషణ్ చైర్మన్ రాజీనామా చేస్తానని ప్రకటించారు.