Home General RTC ప్రయాణం సురక్షితం.. కాదు పెను ప్రమాదం..!

RTC ప్రయాణం సురక్షితం.. కాదు పెను ప్రమాదం..!

నేడు RTC పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపించిది ఈ ఘటన. బస్సు ప్రయాణిస్తుండగానే వెనకచక్రాల బోల్టులు అమాంతం ఊడిపోయాయి. దాంతో ఒక్కసారిగా బస్సు అటూ ఇటూ ఊగిపోతూ కుదుపులకు లోనైంది. ఏం జరుగుతోందో అర్థంకాని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తం అయిన ప్రయాణికులు ఏదో జరిగింది బస్సు ఆపండి అంటూ డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. దాంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

ఈ సంఘటన హైదరాబాద్‌ మూసాపేట్ బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకు వెళ్తే.. సంగారెడ్డి డిపోకు చెందిన ఓ RTC బస్సు 49 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో లింగంపల్లి నుండి విజయవాడకు బయలుదేరింది. మూసాపేట్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి బస్సు వెనక చక్రాల బోల్టులు ఊడిపోయాయి. వెంటనే నట్లు విరిగిపోయాయి. దాంతో బస్సు అటూ ఇటూ ఊగుతూ కుదుపులకు గురైంది.

అయిన డ్రైవర్ గమనించకుండా ముందుకు పోతూనే ఉన్నాడు.. కానీ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏదో జరిగింది అనే అనుమానం వచ్చింది.. దాంతో భయం భయంగా డ్రైవర్ ఉస్మాన్ దగ్గరకు వెళ్ళి బస్సు ఆపండి ఏదో జరిగింది అని అప్రమత్తం చేశారు.. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే డ్రైవర్ RTC ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు కానీ RTC డిపార్ట్ మెంట్ మాత్రం చాలా ఆలస్యంగా స్పందించింది.. దాంతో చేసేదిలేక అర్దరాత్రి 2 గంటల వరకు ప్రయాణికులు రోడ్డుమీదే నిలబడి మరో బస్సుకోసం వేచిచూడాల్సి వచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad