Home Latest News ఏపీలో రీ పోలింగ్ : గ‌ల్లా జ‌య‌దేవ్ అలా రావ‌డంపై వైసీపీ అభ్యంత‌రం..!

ఏపీలో రీ పోలింగ్ : గ‌ల్లా జ‌య‌దేవ్ అలా రావ‌డంపై వైసీపీ అభ్యంత‌రం..!

ఏపీలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో కాసేప‌టి క్రిత‌మే రీ పోలింగ్ ప్రారంభ‌మైంది. కాగా, తొలి విడ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఏప్రిల్ 11న ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల‌లో సాంకేతిక స‌మ‌మ‌స్య‌లు త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఈవీఎంల స‌మ‌స్య త‌లెత్తిన ఐదు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని కోరుతూ స్థానిక క‌లెక్ట‌ర్‌లు గ‌తంలో ఈసీకి నివేదిక పంపారు. క‌లెక్ట‌ర్‌ల నివేదిక ప‌రిశీలించిన ఈసీ ఈ రోజు గ‌ట్టి భ‌ద్ర‌త న‌డుమ రీ పోలింగ్ నిర్వ‌హిస్తోంది.

అయితే, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసిచెట్ల, ప్ర‌కాశం జిల్లాలో ఒక చోట రీ పోలింగ్ జ‌రుగుతోంది. గుంటూరు జిల్లాలోని న‌ర‌సారావుపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కేశ‌న‌ప‌ల్లి 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ల్ల‌చెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్‌కు క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు.

అలాగే, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని అట‌కానితిప్ప 197వ పోలింగ్ స్టేష‌న్, నెల్లూరు అసెంబ్లీ ప‌రిధిలోని ప‌ల్లెపాలెంలోని ఇసుక‌ప‌ల్లిలో బూత్ నెం.41, ప్ర‌కాశం జిల్లాలోని ఎర్ర‌గొండ‌పాలెం క‌డ‌న‌నూత‌ల‌లో 247 పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ జ‌రుగుతోంది.

ఈవీఎంల‌లో త‌లెత్తిన సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కోరుతూ స్థానిక క‌లెక్ట‌ర్‌లు గ‌తంలో ఈసీకి నివేదిక పంప‌డంతో వాటిన ఇప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ సారి ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉండ‌గా, గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం న‌ల్ల‌చెరువు పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎంపీ అభ్య‌ర్ధి గ‌ల్లా జ‌య‌దేవ్ ప‌సుపు కండువాతో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చారు. దీంతో క‌లెక్ట‌ర్, ఎస్పీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అయినా వారిని ప‌ట్టించుకోని జ‌య‌దేవ్ ప‌సుపు కండువాతోనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన వైసీపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అధికారుల తీరుపై మండిప‌డ్డారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad