Home General రైతులకు RBI కానుక.. రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు

రైతులకు RBI కానుక.. రూ. 1.6 లక్షల వరకు హామీ లేకుండా రుణాలు

దేశ రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌ లో సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఇంత ఆనంద సమయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా రైతులకు మరో కానుక ఇవ్వడం అర్శించదగ్గ విషయం.

రైతు నుండి ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 1.60 లక్షలకు పెంచుతున్నట్లు RBI  ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను RBI గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగానే వ్యవసాయ రుణాల అంశాన్ని ప్రస్తావించింది.

“ద్రవ్యోల్బణం, అలాగే పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1.6లక్షల వరకు పెంచుతున్నాం.. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది” అని RBI పేర్కొంది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేస్తామని తెలిపింది. హామీ రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. 1 లక్ష వరకు పెంచుతున్నట్లు 2010లోనే RBI ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad