గరుడవేగ సినిమా ఇచ్చిన ఊపుతో హీరో రాజశేఖర్ చేస్తున్న తాజా మూవీ కల్కి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ వస్తోంది. తాజాగా ఈ సినిమా హానెస్ట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’, ‘ఎవరో ఎవరో’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది.
ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్. విడుదల రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా కల్కి సినిమా నిర్మిస్తున్నారు.
Kalki Honest Trailer | Dr Rajashekar | Adah Sharma | Prasanth Varma | Madhura Audio