Home Latest News కేరళ గొడవలకు రాజకీయాలే మూలం!

కేరళ గొడవలకు రాజకీయాలే మూలం!

కేరళలో చెలరేగిన మంటలు పొరుగున ఉన్న తమిళనాడుకు వ్యాపిస్తున్నాయి. మలయాళీల ఆస్తులపైనా, హొటళ్ళ పైనా దాడులు జరుగుతున్నాయి. కేరళలో ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తుల దగ్ధం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలన్నింటికీ రాజకీయాలే మూలం. కేరళ ఆది నుంచి అక్షరాస్యతకు పెట్టింది పేరు. అక్కడ సనాతన ఆచారాలను పాటించే వారున్నట్టే, అభ్యుదయ వాదులూ ఉన్నారు. మూడు మతాలకు అక్కడ సమాదరణ లభిస్తోంది. అందువల్ల తాజా ఘర్షణల వెనక రాజకీయ శక్తుల హస్తం ఉందన్న ఆరోపణలు నిరాధారం కాదు.

శబరిమల యాత్రకు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏటా సంక్రాతి మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది యాత్రికులు వెళ్తుంటారు. వీరిలో మన తెలుగువారు వేలల్లో ఉంటారు. ఎప్పుడూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాత్ర సాఫీగా సాగుతోంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఘర్షణలు మకర జ్యోతియాత్రకు సంబంధించినవి కావు. అయ్యప్ప స్వామి దర్శనానికి లింగ వివక్ష లేకుండా స్త్రీ, పురుషులంతా వెళ్ళవచ్చని మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానిని పురస్కరించుకుని బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు గర్భగుడిలో ప్రవేశించి స్వామి దర్శనం చేసుకున్నారు. వీరిద్దరూ కేరళకు చెందిన ఆధునిక భావాలు గల విద్యావంతులు.. స్వామి దర్శనానికి పదేళ్ళ లోపు బాలికలనూ, ఏభై ఏళ్ళు పైబడిన మహిళలను మాత్రమే అనుమతించాలన్న నియమం ఉంది.

అంతేకాదు, గర్భగుడిలోకి ఆధునిక దుస్తులతో ప్రవేశించరాదన్న నియమాలు చాలా ఉన్నాయి. అన్ని ఆలయాల్లో కన్నా శబరిమలలో మరింత కఠినమైన నియమాలు అమలులో ఉన్నాయి. మహిళలకే కాదు, పురుషులకూ కఠినమైన నియమాలు ఉన్నాయి.. అయ్యప్ప దీక్షలు చేపట్టే వారు గడ్డకట్టే చలిలో సైతం చన్నీటితోనే స్నానం చేయాలనీ, పాదరక్షలు వేసుకోరాదనీ, రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక ఆలయాన్ని సందర్శించాలనీ, అరటి ఆకుల్లో ఒక పూట భోజనం మాత్రమే చేయాలనీ, కటిక నేలపై పడుకోవాలన్న నియమాలన్నీ చాలా కఠినమైనవే.ఆ నియమాలను పాటించగలిగిన వారే దీక్షలు చేపడతారు.

యాత్రకు వెళ్ళేటప్పుడు ఇరుముడి (మొక్కుబడిగా స్వామికి సమర్పించే సామగ్రి మూట) తలమీదే పెట్టుకోవాలన్న నియమం కూడా ఉంది. ఇవన్నీ సంప్రదాయంలో భాగమే. ఇందులో లింగ వివక్ష లేదు. హిందూ సమాజంలో మహిళలకు అత్యున్నతమైన స్థానం ఉంది. హిందువులు కొలిచే దేవతల్లో ఆది పరాశక్తిది ఎంత ఉత్కృష్ట స్థానమో అందరికీ తెలుసు. మహిళా అర్చకులు మాత్రమే ఉన్న అమ్మవారి ఆలయాలు అనేకం ఉన్నాయి. అందువల్ల మహిళల ఆలయ ప్రవేశంపైన రాద్ధాంతం చేయడం వల్లనే కేరళలో ఇప్పుడు ఘర్షణలు చెలరేగుతున్నాయి. కేరళలో ఇప్పుడు మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్‌ అధికారంలో ఉంది.

ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు ఈ అంశాన్ని సంఘ్‌ పరివార్‌, బిజేపీ నాయకులు ఒక సాకుగా తీసుకున్నారన్నది వామపక్షాల ఆరోపణ. నిజానికి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి ఆలయంలో ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించింది అంతే.. ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ఇదే మాట స్పష్టం చేశారు. ఆలయ సంప్రదాయాలనూ, ఆచారాలను కించపర్చాలన్న ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆయన ఇచ్చిన వివరణ సహేతుకంగానే ఉంది. అయ్యప్ప ఆలయానికి మాత్రమే కాదు., ఆలయాలూ, ప్రార్థనా మందిరాలను సందర్శించేటప్పుడు శుచి శుభ్రతలను పాటించాలన్న నియమం అన్ని మతాల్లోనూ ఉంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదన్న నిషేధాన్ని కఠినంగా అమలు జేస్తున్నందువల్ల మహిళల్లో పట్టుదల పెరిగింది. గతంలో కూడా జయమాల అనే సినీనటి శబరిమల ఆలయాన్ని సందర్శించినట్టు ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు. అయితే, అప్పట్లో విమర్శలు, ప్రతివిమర్శలు మాత్రమే తప్ప ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు.

కేరళలో కాలూనేందుకు సంఘ్‌ పరివార్‌, బిజేపీ శ్రేణులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ శ్రేణులకూ, వైరి వర్గాలకూ మధ్య ఘర్షణలు జరిగే గొడవలు హత్యలకు కూడా దారితీస్తుంటాయి. లింగ వివక్షకు వ్యతిరేకంగా 620 కిలోమీటర్ల పొడవున మహిళలు మానవహారాన్ని నిర్మించిన మరునాడే ఈ ఇద్దరు మహిళలూ ఆలయ ప్రవేశం చేశారు. ఆదిమ జాతుల వారి చేత ఆలయ ప్రవేశం చేయించిన సంప్రదాయం కూడా హిందూ మతంలోనిదే. దళితులకు చిదంబరేశ్వరుని దర్శనం చేయించిన నందుని చరిత్రపై పాత సినీగీతం ఎంతో ప్రజాదరణ పొందింది.

తెలుగునాట పల్నాడులో బ్రహ్మ నాయుడు, కన్నడ సీమలో భక్త కనకదాసు వంటి భక్తాగ్రేసరులు కుల, లింగ వివక్షను వ్యతిరేకించారు. ప్రస్థాన త్రయం ఆది శంకరాచార్యులు, శ్రీమద్రామానుజులు, మధ్వాచార్యులు, త్యాగరాజు, అన్నమయ, రామదాసు వంటి భాగవతోత్తములు శతాబ్దాల క్రితమే ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులేనని చాటి చెప్పారు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్నవన్నీ రాజకీయ ఘర్షణలే. దాడులు జరిపే వారూ, బాధితులూ వైరివర్గాలకు చెందిన వారే కావడం ఇందుకు నిదర్శనం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad