Home Latest News ప‌రువుకోసం.. సొంత కుటుంబ‌స‌భ్యుల క‌ర్క‌శం..ఏడు రోజుల బాలింత హ‌త్య. గ్రామంలో ఉద్రిక్త‌త‌

ప‌రువుకోసం.. సొంత కుటుంబ‌స‌భ్యుల క‌ర్క‌శం..ఏడు రోజుల బాలింత హ‌త్య. గ్రామంలో ఉద్రిక్త‌త‌

చిత్తూరు జిల్లా పలమనేరు మండ‌లం అటవీ సరిహద్దు గ్రామమైన ఊర‌స‌పెంట‌లో దారుణం జ‌రిగింది. ఏడురోజుల బాలింత అని చూడకుండా కుటుంబసభ్యులంతా కలసి క‌న్న‌బిడ్డ‌నే అత్యంత పాశవికంగా గొంతుపిసికి చంపేశారు. మృతదేహాన్ని బావిలో పడేశారు. కన్నతల్లి కూడా ఈఘాతుకంలో పాలుపంచుకోవటం సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తోంది.

ఇంత‌కీ ఆమె చేసిన త‌ప్పిద‌మేంటంటే, కులాంత‌ర వివాహం చేసుకోవ‌డం. వేరే కులానికి చెందిన‌ యువకుడిని ప్రేమించిందన్న ఆగ్రహం.. ఎలాగైనా ఆమెను అంతమొందించాలన్న పట్టుదల.. ఏళ్లు గడిచినా వారిలో తగ్గక‌పోవ‌డంతో ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఊస‌ర‌పెంట‌ గ్రామానికి చెందిన భాస్కర్‌నాయుడు, వరలక్ష్మిల కుమార్తె హేమావతి (23). మూడేళ్లక్రితం ఆమె అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు కేశవన్‌ను ప్రేమించింది. హేమావతి బీటెక్‌ పూర్తిచేయ‌గా, కేశవ్‌ ఇంటర్‌ చదువుతూ మధ్యలో ఆపేసి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వారిరువురి వివాహానికి హేమావతి తల్లిదండ్రులు అంగీకరించక‌పోవ‌డంతో వారు ఇంటినుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు.

కక్ష పెంచుకున్న హేమావ‌తి కుటుంబ సభ్యులు పలుమార్లు ఆ దంపతులపై దాడులు చేశారు. దీంతో ఈ దంపతులు రెండున్నరేళ్లక్రితం ఊరువిడిచి వెళ్లిపోయి బెంగళూరు, జంగాల అగ్రహారం తదితర ప్రాంతాల్లో నివసిస్తూ వచ్చారు. నెలలు నిండటంతో హేమావతి ఇటీవల తన భర్త సోదరి ఇంటికి బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి వచ్చింది. వారం క్రితం హేమావతి పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చి.. ఆస్పత్రి నుంచి నేరుగా అత్తవారింటికి వెళ్లింది.

శుక్రవారం పసిగుడ్డుకు ఒంట్లో నలతగా ఉండటంతో తన భర్త, అత్తలతో కలిసి పలమనేరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బిడ్డను చూపించి తిరుగు ప్రయాణం అయ్యింది. ఊసరపెంట రోడ్డుపై బస్సు దిగింది. అక్కడి నుంచి ఇల్లు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె రోడ్డు దాటుతుండగా హేమావతి తండ్రి భాస్కర్‌నాయుడు, సోదరుడు చరణ్‌లు వారిని అడ్డుకున్నారు.

హేమావతి భర్త, అత్తలపై దాడిచేశారు. హేమావతి తల్లి వరలక్ష్మి, మరో సోదరుడు భానుప్రకాష్‌, చెల్లెలు నిఖిల ఆమెను బలవంతంగా బైక్ మీద‌ ఎక్కించుకొని పోలీసుస్టేషన్‌కు వెళుతున్నాం.. అక్కడికి వచ్చి మాట్లాడండి అంటూ చెప్పి తీసుకుపోయారు. పొలాల్లోకి బండి తిప్పడంతో అప్రమత్తమైన హేమావతి భర్త కేశవన్‌ తనకు తెలిసిన వారికి సమాచారమిచ్చి, తాను కూడా వెనుక పరుగెత్తాడు. పసిబిడ్డ అతని చేతిలోనే ఉన్నాడు.

అప్పటికే అడ్డదారుల్లో పొలాల్లోకి వెళ్లిపోయిన వీరు కనిపించలేదు. మామిడితోటల్లోకి ఈడ్చుకెళ్లి ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశారు. అనంతరం ఆమెను కాళ్లు, చేతులు కట్టేసి లాక్కొస్తున్న దృశ్యం చూసిన కొందరు బిగ్గరగా కేకలు వేయటంతో, మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసి పరారయ్యారు. హేమ తండ్రి భాస్క‌ర్ నాయుడు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఈ సంఘటనపై గ్రామస్థుల ఆగ్ర‌హం క‌ట్టలు తెంచుకుంది. హేమావతి తల్లిదండ్రుల ఇంటిని ధ్వంసం చేసి గడ్డివామును, బైక్‌ను తగలబెట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పరిస్థితి అదుపుతప్పకుండా అదనపు బలగాలతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad