Home General ఈఫిల్ ట‌వ‌ర్‌కు 130 ఏళ్లు.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

ఈఫిల్ ట‌వ‌ర్‌కు 130 ఏళ్లు.. ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఈఫిల్ ట‌వ‌ర్ 130 ఏళ్ల ఉత్స‌వాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక‌మైన లైటింగ్ ప‌ర్యాట‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. 324 మీట‌ర్ల ఎత్తు ఉన్న ఈ క‌ట్ట‌డం ప్యారిస్ న‌గ‌రానికే కాకుండా, ఫ్రాన్స్ దేశానికే ఐకాన్‌గా నిలుస్తోంది.

ప్ర‌పంచ‌లోనే టాప్ 10 ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో ముఖ్యమైనదిగా ఈఫిల్ ట‌వ‌ర్ ఐకాన్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ దేశాల ముందు ఫ్రాన్స్ స‌గ‌ర్వంగా త‌లెత్తుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్మించిన స్వాగ‌త నిర్మాణంగా దీనిని గుర్తిస్తారు. ఇది ప్ర‌పంచ వింత కాక‌పోయినా, నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టాలెస్ట్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ ఇన్ ద వ‌ర‌ల్డ్‌గా రికార్డుల‌కెక్కిన క‌ట్టడంగా ఈఫిట్ ట‌వ‌ర్ నిలిచింది.

గుస్తావే ఈఫిల్ అనే ఇంజినీర్ రూపొందించిన కార‌ణంగా ఈ క‌ట్ట‌డానికి ఈఫిల్ అని పేరు వ‌చ్చింది. 1889 మార్చి 31న మొద‌లైన ఈ క‌ట్ట‌డం నిర్మాణం పూర్త‌య్యేందుకు రెండు సంవ‌త్స‌రాలు రెండు నెల‌లు, ఐదు రోజుల స‌మ‌యం ప‌ట్టింది. దీని వైశాల్యం రెండున్న‌ర ఎక‌రాలు, బ‌రువు ప‌దివేల ట‌న్నులు, 324 మీట‌ర్ల ఎత్తు ఉన్న ఈ ట‌వ‌ర్‌లో 1,665 మెట్లు ఉన్నాయి.

1880లోనే ఈ కట్ట‌డం నిర్మాణానికి 78ల‌క్ష‌ల ఫ్రెంచ్ డాల‌ర్ల వ్య‌యం అయింది. ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ప‌ర్యాట‌కులు ఈఫిల్ ట‌వ‌ర్‌ను చూసేందుకు వ‌స్తుంటారు. వేస‌వి కాలంలో అయితే రోజుకు 30 వేల మంది ట‌వ‌ర్ ఎక్కి దిగుతూ ఉంటారు. ప్ర‌తి ఏటా 70 ల‌క్ష‌ల మంది సంద‌ర్శ‌కులు ఈఫిల్ ట‌వ‌ర్ సంద‌ర్శ‌న‌కు వ‌స్తుంటారని స‌మాచారం.

ముఖ్యంగా ఈఫిట్ ట‌వ‌ర్‌పై నుంచి ప్యారిస్ అందాల‌ను చూడ‌టం ఓ అద్భుత అనుభూతి. ఈఫిట్ ట‌వ‌ర్ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే కాకుండా.., ఫ్రాన్స్‌కు ఎన్నో విధాలుగా ఉపయోగ‌ప‌డింది.

మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలోని ఓడ‌ల‌కు వైర్‌లెస్ టెలీగ్రాఫ్ పంపేందుకు ఈ ట‌వ‌ర్ ఉప‌యోగ‌ప‌డింది. శ‌త్రువుల సందేశాలు ప్ర‌సారం కాకుండా అడ్డుకునేందుకు సాయ‌ప‌డింది. ఇప్ప‌టికీ ఈఫిల్ ట‌వ‌ర్‌పై వివిధ ఛానెళ్లు, రేడియోలకు సంబంధించిన 120 యాంటీనాలు ఉన్నాయి. ఈఫిల్ ట‌వ‌ర్ ఎంతో ఎత్తులో ఉండ‌టం వ‌ల్ల వీటి ప్ర‌సారాలు ఎంతో స్ప‌ష్టంగా ఉంటాయి.

efhil 2

 

efhil 1

efhil 3

 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad