ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతల వెరైటీ స్టంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న హీరో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచి బీట్సాంగ్కు స్టెప్పులేవారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు కార్యకర్తలతో కలిసి డ్యాన్ష్ చేస్తూనే తనకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్ధించారు.
మరో పక్క గత ఎన్నికల్లోకంటే అత్యధిక మెజార్టీతో తన భర్త బాలకృష్ణ విజయం ఖాయమని ఆయన సతీమణి వసుంధర అన్నారు. హిందూపురం నియోజకవర్గం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. బాలకృష్ణను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇస్త్రీచేస్తూ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.