రాజకీయాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేలా కొందరు మాత్రమే పాలన చేయగలుగుతారు. అలాంటి వారిలో నాడు దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలను చూశా. వారిద్దరికి ఉన్న పట్టుదలనే నేడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలో చూస్తున్నానంటూ టాలీవుడ్ నటుడు అలీ అన్నారు.
కాగా, నటుడు అలీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచి పార్టీ విధి విధానాలు, నేతల ఎంపిక, రాష్ట్ర విభజన సమయంలో జగన్ వ్యవహరించిన శైలి, అధికార పార్టీ అవినీతిని ఎండగట్టడంలో జగన్ పోరాటం, ప్రత్యేక హోదా అంశంపై జగన్ చేసిన పోరాటాన్ని ఏపీ ప్రజలు మరిచిపోలేరని, ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడ్డ నేత అయిన జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఓట్లతో సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ అధికారంలోకి రావడం, ఏపీకి ప్రత్యేక హోదా రావడం రెండూ ఒకేసారి జరగడం తధ్యమని అలీ వ్యాఖ్యానించారు.