Home General ఎన్ఆర్ఐ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ : జ‌య‌రామ్ పుట్టుక పూర్వోత్త‌రాలు..!

ఎన్ఆర్ఐ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ : జ‌య‌రామ్ పుట్టుక పూర్వోత్త‌రాలు..!

చిగురుపాటి జ‌య‌రామ్ గ‌త మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరిది. అనుమానాస్ప‌ద రీతిలో మృతి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త చిగురుపాటి జ‌య‌రామ్. మీడియా, పారిశ్రామిక‌రంగంలో ఇది సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో చిగురుపాటి జ‌య‌రామ్ ఎవ‌రు..? ఆయ‌న హ‌త్య‌కు గురి కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఏంటి…? అనేదానిపై ఒక‌సారి విశ్లేషించుకుందాం. విజ‌య‌వాడ‌లో సామాన్య కుటుంబంలోపుట్టి పెరిగి, అమెరికాలో బ్యాంకు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన ప్ర‌స్థానం ఆయ‌న‌ది.

ఔష‌ధ‌రంగంలో తిరుగులేని ప‌ట్టుకున్న డా.జ‌య‌రామ్ 90వ ద‌శ‌కంలో అమెరికా వెళ్లారు. ఉన్న‌త విద్య త‌రువాత ర్యామ్‌బ్యాక్సీలో భాగ‌స్వామిగా ఉన్నారు. పారిశ్రామికంగా ఉన్నత స్థానాల‌కు ఎదిగినా ఆయ‌న చుట్టూ ఆది నుంచి వివాదాలే. పేషెంట్ల విష‌యంలో గొడ‌వలు. భాగ‌స్వాముల‌తో విభేదాలు. ఉద్యోగుల‌తో వివాదాలు. డా.జ‌య‌రామ్ ప్ర‌స్థానంలో సాధార‌ణమ‌య్యాయి.

జ‌య‌రామ్ విజ‌య‌వాడ కానూరుకు చెందిన జ‌య‌రామ్ తండ్రి కృష్ణ‌మూర్తి మ‌త్స్య‌శాఖ‌లో ఏడీగా ప‌నిచేసేవారు. ఆయ‌న స‌హ‌కారంతోనే విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల చాలా ఆక్వా ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ధి చెందాయి. విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ చిగురుపాటి కుటుంబానికి ద‌గ్గ‌రి బంధువు.

కృష్ణమూర్తి ముగ్గురు పిల్ల‌ల్లో జ‌య‌రామ్, మరో ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. విజ‌య‌వాడ మొగ‌ల్ రాజ‌పురం రెవెన్యూ కాల‌నీల‌కు చెందిన ప‌ద్మ‌శ్రీ‌తో జ‌య‌రామ్ వివాహం జ‌రిగింది. వీరికి చాలాకాలంపాటు పిల్ల‌లు లేరు. పెళ్లి త‌రువాత భార్య‌తో అమెరికాలో స్థిర‌ప‌డిన జ‌య‌రామ్ ఫార్మారంగంలో తిరుగులేని ప‌ట్టు సాధించారు. క్యాన్స‌ర్ చికిత్స‌లో వాడే ఔష‌ధాలు సంతాన లేమికి వాడే ఔష‌ధాలు, డ‌యాల‌సిస్‌లో అవ‌స‌ర‌మ‌య్యే థెర‌ఫ‌టిక్ ఇలా ఒక‌టేంటి..! ఆధునిక ఔష‌ధ రంగంలో వినియోగించే చాలా మందులు ఆయ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి.

దేశంలోని ప్ర‌ముఖ ఔష‌ధ కంపెనీతో త‌లెత్తిన వివాదం ఆయ‌న జీవితాన్ని మార్చేసింద‌ని చెబుతున్నారు. ఓ కంపెనీలో స‌హ భాగ‌స్వామిగా ఉన్న క్ర‌మంలో విభేదాలు త‌లెత్త‌డంతో దానిపై కోర్టుకెక్క‌డం, ఆ కేసులో ప‌రిహారంగా వంద‌ల కోట్లు ల‌భించ‌డంతో డాక్ట‌ర్ జ‌య్ పేరు ఫార్మా వ‌ర్గాల్లో మారుమోగింది.

ఆ త‌రువాత ఆయ‌న వెనుతిరిగి చూసుకోలేదు. జయ‌రామ్ ఇద్ద‌రి చెల్లెల‌లో పెద్ద చెల్లి శ‌శిక‌ళ గుడ్ల వ‌ల్లేరుకు చెందిన వెంక‌టాద్రితో వివాహ‌మైంది. ఆమె ముగ్గురు పిల్ల‌లు జ‌య‌రామ్ వ్యాపార సంస్థ‌ల్లో కీల‌క స్థానాల్లో ఉన్నారు. రెండో చెల్లెలు సుశీల ఇద్ద‌రు కుమార్తెల బాగోగులు కూడా జ‌య‌రామ్ చూసుకున్నారు.

చెల్లెలు భ‌ర్త కొంత కాలం క్రితం చ‌నిపోవ‌డంతో చాలా కాలంగా ఆమె అన్న‌వ‌ద్దే ఉంటోంది. విజ‌య‌వాడ కానూరులో ఉన్న జ‌య‌రామ్ త‌ల్లిదండ్రుల‌తోపాటే ఆమె ఉండేది. రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే జ‌య‌రామ్ త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. మ‌రో వైపు వ్యాపార రంగాల్లో ఉన్న స్థానాల‌కు ఎదిగిన జ‌య‌రామ్ పిల్ల‌లు లేక‌పోవ‌డంతో భార్య ప‌ద్మ‌శ్రీ చెల్లెలు కుమార్తెను దత్త‌త తీసుకున్నారు.

ద‌త్త‌త తీసుకున్న రెండేళ్ల త‌రువాత జ‌య‌రామ్‌కు కుమారుడు పుట్టాడు. 2013 వ‌ర‌కు ఈ కుటుంబంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. 2003 నుంచి, ఆయ‌న భార‌త్‌లో ఔషధ రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. బ‌యాల‌జీ, పాలిస్చ‌ర్స్, ఫార్మీ రీస‌ర్చ్, ఇన్‌ఫ్రా, రియ‌ల్ ఎస్టేట్, బ్యాకింగ్, ఐటీ ఇలా అన్ని రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టారు.
అదే స‌మ‌యంలో ఆయ‌న‌తోపాటు వివాదాలు కూడా పెద్ద‌వి అవుతూ వ‌చ్చాయి.

ఇక ఫార్మా పేటెంట్ల విష‌యంలో కూడా జ‌య‌రామ్ సంకుచితంగా ప్ర‌వ‌ర్తిస్తార‌నే ప్ర‌చారం ఉంది. చాలా మంది పెద్ద‌ల‌ను పేటెంట్ వివాదాల‌తో జ‌య‌రామ్ నిత్యం వేధించే వార‌ని చెబుతారు. న‌ష్టాల్లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను వ‌దిలించుకోవ‌డంలో కూడా జ‌యరామ్ నిర్ధ‌య‌గా ప్ర‌వ‌ర్తిస్తార‌ని చెబుతారు.

హైద‌రాబాద్‌లో క‌ళ్ల‌ద్దాలు త‌యారు చేసే టెక్ట్రాన్ ప‌రిశ్ర‌మ మూసివేయ‌డంతో ఉద్యోగులు రోడ్డున ప‌డ్డారు. వారు కోర్టుకు వెళ్ల‌డంతో ఏడాది క్రితం జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. 2013లో ఆయ‌న నెల‌కొల్పిన జేఎస్డీ డేటా మీడియా ప్రైవేవ‌ట్ లిమిటెడ్ పేరుతో ఎక్స్‌ప్రెస్ టీవీని నెల‌కొల్పారు. అందులో డాక్ట‌ర్ జ‌యరామ్‌, ఆయ‌న భార్య, పంజాబ్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ టీవీ ఓన‌ర్లు డైరెక్ట‌ర్లు. ఏడాద‌న్న‌ర త‌రువాత అనూహ్యంగా ఆయ‌న మేన కోడ‌లు పులివ‌ర్తి మాధురి అలియాస్ శిఖా చౌద‌రి వైస్ ప్రెసిడెంట్‌గా అడుగుపెట్టింది.

మ‌రో మేన కోడ‌లు మ‌నీషా ఫార్మా కంపెనీల‌లో డైరెక్ట‌ర్ అయ్యారు. ఇది కుటుంబంలో గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మైంది. డాక్ట‌ర్ జ‌య‌రామ్ అన్ని కంపెనీల‌లో మేన కోడ‌ళ్ల‌ను డైరెక్ట‌ర్లుగా చేయ‌డంపై ఆయ‌న భార్య ప‌ద్మ శ్రీ విభేదించ‌డం ప్రారంభించారు. దీంతో ఆయ‌న నెల‌కొల్పిన న్యూస్ ఛానెల్‌కు ఫండింగ్ ఆగిపోయింది. క్ర‌మంగా ఆ ఛానెల్ మూత ప‌డింది.

2016లో ఛానెల్ ఒడిదుడుకుల్లో ఉన్న స‌మ‌యంలో చిన్న మేన కోడ‌లికి రూ.2 కోట్లు డొనేష‌న్ చెల్లించి ఏలూరు మెడిక‌ల్ కాలేజీలో మెడిసిన్ సీటు కొనుగోలు చేయ‌డం మ‌రో మేన కోడలికి బీఎండ‌బ్ల్యూ కారును కొనివ్వ‌డం ఉద్యోగుల ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌య్యాయి. దీంతో వారు లేబ‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు. ఆ త‌రువాత క్ర‌మంగా ఆయ‌న మిత్రుల‌ను వ‌దిలేసి బంధువుల ఆధీనంలోకి వెళ్లిపోయారు. నెల క్రితం అమెరికా నుంచి వ‌చ్చిన జ‌య‌రామ్ అదే నెల 21న జ‌రిగిన కోస్ట‌ల్ బ్యాంక్ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నారు. బ్యాంకు ఎండీని మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త ఎండీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత హైద‌రాబాద్ వెళ్లిపోయారు.

2015 త‌రువాత న్యూస్ ఛానెల్ నిర్వ‌హ‌ణ‌పై స‌ల‌హాలు ఇచ్చే పేరుతో డాక్ట‌ర్ జ‌య్‌కు శిఖా ద‌గ్గ‌ర‌య్యారు. క్ర‌మంగా మిగిలిన సంస్థ‌ల్లో డైరెక్ట‌ర్‌గా చోటు సంపాదించారు. అయితే, ఆ త‌రువాత ఆమె స్నేహితుడు రాకేశ్ జ‌య‌రామ్‌కు ప‌రిచ‌యం అవ‌డం, అత‌నితో జ‌య‌రామ్‌కు ఆర్థిక లావాదేవీలు ఉండ‌టంతో వారి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. హ‌త్య‌కు కార‌ణమ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. శిఖా కూడా జ‌య‌రామ్‌తో త‌న బంధాన్ని పోలీసుల ముందు బ‌య‌ట‌పెట్టింది. జ‌య‌రామ్‌ను హ‌త్య చేసిన‌ట్టు రాకేశ్ ఒప్పుకున్నాడు కూడా. మొత్తానికి సామాన్య కుటుంబంలో పుట్టి అస‌మాన్యుడిగా ఎదిగిన శ్రీ‌రామ్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం డ‌బ్బే మ‌నిషిని శాశిస్తుంద‌న్న అర్ధంగా మిగిలిపోతుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad