దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దుసుకేల్తున్నాయి. బుధవారం ఉదయం 9.55 సమయంలో సెన్సెక్స్ 290 పాయింట్ల లాభంతో 35,643 నిఫ్టీ.. 71 పాయింట్ల లాభంతో 10,675 వద్ద ట్రేడవుతోంది. ఇక వేదాంత షేర్లు దాదాపు 2శాతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 1 రూపాయి విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే 5 పైసలు బలపడి రూ.71.29 వద్ద ట్రేడ్ అవుతుంది.
ఇందుకు ప్రదాన కారణం క్రూడాయిల్ ధరలు తగ్గడమే అని చెప్పాలి. మరోవైపు WTI క్రూడ్ ఫ్యూచర్ ధరలు 25 సెంట్లు పతనమై 55.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. బజాజ్ ఫైనాన్స్, యస్‌బ్యాంక్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుంటే.. బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.