తెలుగుదేశం పార్టీనేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇటీవల మృతి చెందిన ప్రముఖ నటి, లేడీ సూపర్‌స్టార్ విజయనిర్మల స్మృతికి ఘననివాళి అర్పించారు. ఆమె చిత్రపటానికి నమస్కరించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించారు. తల్లితండ్రితో కలిసి కృష్ణ నివాసానికి చేరుకున్న లోకేష్ కుటుంబసభ్యుల్ని ఓదార్చారు.
“ఈరోజు ప్రముఖ నటులు కృష్ణగారిని వారి నివాసం వద్ద కలుసుకున్నాను. కృష్ణగారి సతీమణి శ్రీమతి విజయనిర్మలగారి మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేశాను.”అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించారు లోకేష్.